అసలు శ్రీ లలితా దేవికి చరిత్ర ఉన్నదా?

లలితా దేవి గానీ, బాల త్రిపుర సుందర, శ్యామల, రాజేశ్వరి ఇత్యాదిగా పిలువబడే స్త్రీ దేవతలందరు, పార్వతీ దేవి యొక్క సత్త్వ, రాజస స్వరూపాలు.కాళి, చండి, ఇత్యాది రూపాలన్నీ ఆమె తామస రూపాలుగా పురాణాలు చెబుతున్నాయి.

 Does The Originl Sri Lalith Have A History , Devotional, Lalitha Devi Charithra-TeluguStop.com

మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఆమెయే.ఆదిపరా శక్తి కూడా ఆమెయే.

శ్రీ కృష్ణుడు శ్యామలా రూపుడని, శ్రీ రాముడు లలితా స్వరూపమని, శాక్తేయులు చెబుతారు.అయితే లలితా దేవి వేరు.

త్రిపుర సుందరి వేరు.బాలా త్రిపుర సుందరి వేరు.

పూర్వం మహిషాసురుని సంహరించటానికి త్రిమూర్తులు, దేవతా సహితులై ఆతని మీదికి యుద్ధానికి వెళ్ళారు.కానీ బ్రహ్మ దత్త వర ప్రభావం వల్ల పురుషుల చేతుల్లో చనిపోడు వారు ఆ విషయం తెలుసుకుని ఎలా వధించ వలెనని, ధ్యానమగ్నులై ఉండగా వారి అందరి శరీరముల నుండి ఒక మహా తేజస్సు బయలు వెడలి క్రమంగా ఏకమై ఆకాశంలో వారి ఎదుట ముఖము శ్వేత పుండరీకముల వలె విష్ణు ముఖము వలె నొప్పింది.

శివుని ప్రభావమున ఆమెకు మూడు నేత్రములు కల్గినవి.ఒక కన్ను ఎఱ్ఱగా ఒక కన్నునల్లగా ఒక కన్నుతెల్లగా భాసించాయి.

ఆ మూడు నేత్రాల్లో అగ్ని ఆవహించింది.

వాయు తేజంతో చెవులు, సంధ్యా తేజంతో నల్లనైన వెంట్రుకలతో ధనుస్సును బోలిన కను బొమలు, కుబేరుని తేజస్సుతో నువ్వు పువ్వు వంటి నాసిక, బ్రహ్మ తేజమున మల్లె మొగ్గల వంటి నాసిక, బ్రహ్మతేజ మున మల్లె మొగ్గల వంటి దంతములు, సూర్యతేజస్సు వలన క్రిందిపెదవి, మహావిష్ణ్వంశమున బాహువులు, వసువుల అంశమున ఆమెవ్రేళులు, చంద్రు నంశమున స్తనములు, ఇంద్రాంశతో త్రివళీయుతమైన నడుము, భూమి అంశమున కటిప్రదేశంతో ఆమె ఆవిర్భవించింది.

దేవతలు ఆయుధాల నన్నింటినీ ప్రసాదించారు.ఆమె గురించి విని మహిషుడామెను పట్టమహిషిగా పొందాలని భావించి, మంత్రి సేనా సము దయ సమన్వితంగా ఆమెచే చంపబడినాడు.దేవతలందరు ఆమెను త్రిలోక రి.ఆమెనే త్రిపుర సుందరిగా వివిధ నామాలతో నేటికీ సుందరిగా ఆరాధించిరి.ఆమెనే అర్చిస్తున్నారు.ఈమె పేరులోని త్రిపుర శబ్దానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి.

Telugu Devotional, Lalithadevi-Telugu Bhakthi

శరీసౌందర్యంతలు తమ భూమి పురమంటే శరీరం.కన్ను, శిరస్సు, హృదయం లేక సూర్య, చంద్ర, అగ్ని అనే మండలాలకు వాగ్భటకూడ, కామకూట, శక్తికూటాల కామె అధీశ్వరి కనుక ఆమెకు త్రిపురేశ్వరి అనిపేరు వచ్చింది.పంచాక్షరీ మంత్రం లోని మూడు భాగాలను, ఆమె శరీరంలోని మూడు భాగాలుగా కొందరు భావించారు.మొదటి భాగం శిరస్సు, అక్కడి నుంచి నాభి వరకు రెండవ భాగం, అక్కడ నుండి క్రింది భాగం మూడవ భాగంగా భావించారు.

ఇవి వరుసగా వాగ్భట, శక్తి, కామ కూటాలకు నిలయాలు.శంకరాచార్యుల వారు సౌందర్య లహరిలో త్రిపురా సుందరి వర్ణనం ఎంతో గొప్పగా కావించారు.కాళికా దేవి యొక్క సౌందర్య స్వరూపం లలితా దేవి.అష్టాదశ మహాశక్తి పీఠాలలో ప్రయాగలో లలితాపీఠం ఉన్నది.

ఔత్తరాహులలో లలితోపాసన చాలా తక్కువ.లలితా దేవి ఒక మంచముపై కూర్చుండి ఉంటుంది.

ఆ మంచానికి రుద్రుడు, విష్ణువు, బ్రహ్మ, ఈశ్వరుడు నలుగురు నాలుగు కాళ్లు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube