టాలీవుడ్ బుట్ట బొమ్మగా నిలిచిన ముద్దుగుమ్మ పూజా హెగ్డే గురించి తెలియని వారెవ్వరూ లేరు.ప్రస్తుతం ఈ అమ్మడి క్రేజ్ టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది.
అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ క్రేజ్ సంపాదించుకుంది.చాలా వరకు స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకుంది.
ఇక తన అందంతో ఎంతోమంది కుర్రాళ్లను ఆకట్టుకొని వారిని అభిమానులుగా మార్చుకుంది.ఎంత బిజీ లైఫ్ లో ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా కనిపిస్తుంది.తొలిసారిగా 2010లో సినీ ఇండస్ట్రీకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.2014లో ముకుంద సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది.కెరీర్ మొదట్లో వరుస ఫ్లాప్ ను అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఒక లైలా కోసం సినిమాలో నటించి మంచి సక్సెస్ అందుకుంది.

ఇక నిజానికి దర్శకనిర్మాతలు కూడా పూజా హెగ్డే ను ఎంతో సెంటిమెంట్ గా భావిస్తారు. అలా వైకుంఠపురంలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ బుట్ట బొమ్మ.ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంది.
ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలలో బాగా బిజీగా ఉంది.పైగా పాన్ ఇండియా మూవీ లో అవకాశాలు అందుకుంటూ మంచి సక్సెస్ తో దూసుకుపోతుంది.
సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను బాగా షేర్ చేసుకుంటోంది.ప్రతి రోజు ఏదో ఒక పోస్టు తో నెటిజన్లను ఆకట్టుకుంటుంది.
అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ లైవ్ కాల్ కూడా మాట్లాడుతూ ఉంటుంది.ముచ్చట్లు బాగా పెడుతూ వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతోంది.
మొత్తానికి సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా కొన్ని స్టోరీస్ పంచుకుంది.అందులో తన ఫ్రెండ్స్ తో కలిసి ఫోటో దిగినట్లు కనిపించగా ఆ ఫోటోని షేర్ చేసుకుంది.ఇక ఆ ఫోటో కోర్టు దగ్గర దిగినట్లు కనిపించింది.
ఇక ఆ ఫోటో చూసిన నెటిజన్లు తెగ లైక్ లతో పాటు కామెంట్లు కూడా పెడుతున్నారు.పూజ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందా అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
మొత్తానికి తన ఫోటోలతో పూజ బాగా హంగామా చేసినట్లు కనిపిస్తుంది.

ఇక సినిమాల విషయానికొస్తే టాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో హీరో రామ్ చరణ్ సరసన నటిస్తుంది.ఇటీవల విడుదలైన ప్రభాస్ పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ లో కూడా నటించగా ఈ సినిమా ప్రస్తుతం థియేటర్ లో సందడి చేస్తుంది.మరోవైపు బాలీవుడ్ లో పలువురు స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకుంది.
తమిళంలో కూడా ఓ సినిమాలో బిజీగా ఉంది.వీటితో పాటు పలు సినిమాల్లో కూడా అవకాశాలు అందుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.







