దేశమంతా ఆసక్తిగా ఎదురు చూసిన ఉత్తరాది ఐదు రాష్ట్రాల ఎన్నికలు అయిపోవడం… ఫలితాలు రావడం .బీజేపీ ఘన విజయం సాధించడం.
కాంగ్రెస్ ఘోర పరాజాయాన్ని చవిచూడడం వంటివి జరిగిపోయాయి.దీంతో కాంగ్రెస్ నేతలు నైరాశ్యంలో ఉన్నారా ? అంటే అవుననే సమాధానం వస్తుంది.135 ఏండ్ల ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ దాదాపు అర్థశతాబ్ధానికి పైగా దేశాన్ని పాలించింది.స్థానికంగా ఎన్ని పార్టీలు పుట్టుకొచ్చినా బలమైన క్యాడర్‌తో దశాబ్ధాల పాటు పలు రాష్ట్రాలను ఏకధాటిగా ఏలింది.
అయితే కేంద్రంలో మోడీ అధికారంలోకొచ్చిన నాటి నుంచి ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కోలుకోలేని ఓటములు చవిచూసింది.గ్రాండ్ ఓల్డ్ పార్టీగా పిలవబడే కాంగ్రెస్ రోజురోజుకూ తన ప్రాభవాన్ని కోల్పోతోంది.
ఇలాంటివి కాంగ్రెస్ పార్టీకి కొత్త కాదు.అయితే వరుసగా వస్తున్న ఓటములు, నాయకత్వ లేమి, నిర్ణయాలు తీసుకోవడంలో లోపాలు ఉండడంతో కాంగ్రెస్ సంక్షోభంలో పడుతోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఇలాంటి నేపథ్యంలో పార్టీని మరింత దెబ్బ తీసే పరిణామాలు ఇటీవల చోటుచేసుకుండడంతో పార్టీ శ్రేణులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
తాజాగా కాంగ్రెస్ పార్టీని వీడటంపై శత్రేఘ్న సిన్హా సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాను కాంగ్రెస్ పార్టీని వీడి తృణమూల్ కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు వెల్లడించారు.అయితే దీనికి కారణం పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్(పీకే), కేంద్ర మాజీమంత్రి యశ్వంత్ నిన్హానే కారణమని చెప్పడం ఆసక్తికరంగా మారింది.
తాను పార్టీ మారే విషయంలో వారే కీలక పాత్ర పోషించారని చెప్పుకొచ్చారు.

ఇప్పుడు తన ఫోకస్ అంతా తృణమూల్ కాంగ్రెస్‌పైనే ఉందని వెల్లడించారు.అయితే ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ పరిస్థితులపై ఆయన మాట్లాడారు.ప్రస్తుతం ఆ పార్టీ సంక్షోభం ముంగిట్లో ఉందంటూ చెప్పుకొచ్చారు.
ఇంతకు మించి తానేమి కాంగ్రెస్‌పై విమర్శలు చేయదలుచుకోలేదని చెప్పడం చర్చకు దారి తీస్తోంది.అయితే తాను కాంగ్రెస్ వీడే అంశంపై త్వరలోనే చెబుతానంటూ సస్పెన్స్ పెట్టారు.

మొత్తంగా శత్రుఘ్న సిన్హా చెప్పిన దాని బట్టి చూస్తే భవిష్యత్‌లో కాంగ్రెస్‌కు మరిన్ని సమస్యలు చుట్టుముడుతాయని, మరింత సంక్షోభం ఎదుర్కోబోతోందని అంశం అర్థమవుతోంది.అయితే కాంగ్రెస్‌ను నిర్వీర్యం చేయడంలో పీకే కీలక భూమిక పోషించారనే టాక్ వినిపిస్తోంది.మరోవైపు త్వరలో జరిగే అసన్ సోల్ ఎంపీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిగా శత్రుఘ్న సిన్హాను బరిలో దింపుతున్నటు్ట మమతా బెనర్జీ ప్రకటించిన విషయం విధితమే.ఇలాంటి షాట్ గన్ తూటాలు పేల్చే వారు కాంగ్రెస్‌లో ఇంకెంతమంది ఉన్నారో అనే సందేహం వ్యక్తమవ్వక మానదు.
మరి కాంగ్రెస్ పరిస్థితి భశిష్యత్ ఏంటో తెలియాలంటే చూడాల్సిందే.







