ఇక నాగబాబు( Nagababu ) ప్రొడ్యూసర్ గా చిరంజీవి( Chiranjeevi ) హీరో గా వచ్చిన స్టాలిన్ సినిమా( Stalin Movie ) భారీ అంచనాలతో వచ్చినప్పటికీ అది పెద్దగా విజయం సాధించలేదనే చెప్పాలి.ఎందుకంటే ఈ సినిమా లో కథ బాగున్నప్పటికీ అది ఎందుకో ప్రేక్షకులకి నచ్చలేదు అందుకే ఆ సినిమా ప్లాప్ అయింది.
ఈ సినిమా కంటే ముందే నాగబాబు ప్రొడ్యూసర్ గా చిరంజీవి హీరో గా రుద్రవీణ అనే సినిమా చేశాడు ఈ సినిమా అనుకున్న రేంజ్ లో ఆడలేదు ఇక దాంతో నాగబాబు ఆర్థికం గా కొంత వరకు నష్టపోయాడనే చెప్పాలి.ఇక పవన్ కళ్యాణ్ హీరో గా వచ్చిన గుడుంబా శంకర్( Gudumba Shankar ) సినిమాతో మరోసారి నాగబాబు తన లక్కు ని పరీక్షించుకున్నారు

కానీ ఈ సినిమా కూడా ప్లాప్ అవ్వడం తో వరుసగా నాగబాబు ప్రొడ్యూస్ చేసిన మెగా ఫ్యామిలీ హీరోల రెండు,మూడు సినిమాలు ప్లాప్ అయ్యాయి ఇక ముచ్చట గా మెగా ఫ్యామిలీ లో మూడో స్టార్ హీరో అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో తీసిన ఆరెంజ్ సినిమా( Orange Movie ) కూడా డిజాస్టర్ కావడం తో ఆయన అప్పటి నుంచి సినిమాలు చేయడం ఆపేసాడు…అయితే వాళ్ల అమ్మ పేరు మీద పెట్టిన ఆ బ్యానర్ లో సినిమాలు చేయకుండా ఉండటం అంటే చిరంజీవి కి ఎందుకో నచ్చడం లేదట.అందుకే మళ్ళీ ఈ బ్యానర్ ను తెర మీదకి తీసుకురావాలని చిరంజీవి అనుకుంటున్నట్లు గా తెలుస్తుంది.

ఎందుకంటే చిరంజీవి కి వాళ్ల అమ్మ( Chiranjeevi Mother ) అంటే ఆయనకి చాలా ఇష్టం… అందుకే వాళ్ల అమ్మ పేరు ని చెడగొట్టకుండా ఆ బ్యానర్ కూడా సక్సెస్ ఫుల్ బ్యానర్ అని మంచి పేరు తెచ్చుకోవాలని చిరంజీవి అనుకుని ఇపుడు మళ్లీ చిరంజీవి హీరో గా అంజనీ ప్రొడక్షన్స్ బ్యానర్ లో( Anjani Productions ) ఒక సినిమా చేస్తున్నారు అనే టాక్ అయితే వినిపిస్తుంది.ఇక దీని కోసం ఒక యంగ్ డైరెక్టర్ కూడా డైరెక్షన్ చేయనున్నట్టు గా తెలుస్తుంది…అయితే ఇప్పటికే కథ చర్చలు కూడా నడుస్తున్నాయట అయితే ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ అధికారిక ప్రకటన వచ్చే దాకా ఇది నిజమా లేదా అనేది తెలియదు అది రావాలంటే మనం మరికొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు…
.







