1.చిన జీయర్ స్వామి ని తొలగించాలి
యాదగిరిగుట్ట బాధ్యతల నుంచి చిన్నజీయర్ స్వామి ని తొలగించాలని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
2.హోలీ సందర్భంగా పోలీసుల ఆంక్షలు
హోలీ సందర్భంగా హైదరాబాద్ లో పోలీసులు ఆంక్షలు విధించారు.బహిరంగ ప్రదేశాల్లో హోలీ వేడుకలను నిషేధించారు.
3.ఆర్టీసీ పల్లె వెలుగు బస్సుల్లో రౌండప్ చార్జీల అమలు
తెలంగాణ ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు లు చిల్లర సమస్యలకు చెక్ పడింది.చిల్లర సమస్యను గుర్తించిన ఆర్టిసి ఎండి సజ్జనార్ చార్జీలను ఖరారు చేశారు.
4.సిలబస్ అప్డేట్ పై టిఎస్ పీఎస్ దృష్టి
ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు అందిన వెంటనే జాబ్ నోటిఫికేషన్ జారీ చేయడానికి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిద్ధం అవుతోంది.తాజాగా భర్తీ చేయనున్న పోస్టులకు కొత్త సిలబస్ రూపొందించే పనిలో టిఎస్ పీఎస్సి ఉంది.
5.భారత్ లో కరోనా
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2,528 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
6.పెగాసేస్ సాఫ్ట్ వేర్ ను టిడిపి ప్రభుత్వం కొనుగోలు చేయలేదు
పెగాసస్ సాఫ్ట్ వేర్ ను అప్పటి టిడిపి ప్రభుత్వం కొనుగోలు చేసింది అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపణలు చేయడంపై నారా లోకేష్ స్పందించారు.తమ ప్రభుత్వం అప్పట్లో దీనిని కొనుగోలు చేయలేదని ఆయన క్లారిటీ ఇచ్చారు.
7.జనసేన పై ఏపీ మంత్రి మండిపాటు
జనసేన పార్టీపై ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి స్పందించారు.ఎన్నికల సమయంలో ఒక్కో పార్టీతో ఒక్కోసారి పొత్తు పెట్టుకోవడం జనసేనకు అలవాటుగా మారిందని బాలినేని విమర్శించారు.
8.విశాఖ శ్రీవారి ఆలయంలో మహా సంప్రోక్షణ
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మించిన విశాఖలోని శ్రీవారి ఆలయంలో నేడు మహా సంప్రోక్షణ నిర్వహించారు.
9.మల్లన్న సేవలో స్వరూపానందేంద్ర
శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వార్లను శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారు ఈరోజు దర్శించుకున్నారు.
10.జగన్ శుభాకాంక్షలు
హోలీ సందర్భంగా ఆంధ్ర అ ప్రజలకు సీఎం జగన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
11.జగన్ కు సిపిఐ రామకృష్ణ లేఖ
కల్తీ మద్యం తాగి 27 మంది చనిపోతే వాస్తవాలను వక్రీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు ప్రయత్నించడం సిగ్గుచేటని సిపిఐ రామకృష్ణ జగన్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు.
12.తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం గా కొనసాగుతోంది.గురువారం తిరుమల శ్రీవారిని 66,577 భక్తులు దర్శించుకున్నారు.
13.రైల్వే కి 10 వేల కోట్ల రాబడి
దక్షిణ మధ్య రైల్వే లో వివిధ వస్తువుల రవాణాకు ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో పది వేల కోట్ల ఆదాయం వచ్చిందని సి పి ఆర్ ఓ సి హెచ్ రాకేష్ వెల్లడించారు.
14.రాష్ట్రానికి అప్పులు ఇవ్వొద్దు : రఘురామ
ఏపీ ప్రభుత్వానికి ఎంత అడిగితే అంత అప్పు ఇవ్వద్దని కేంద్ర ఆర్థిక శాఖ విభాగం కార్యదర్శి సోమనాథ్ కు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు విజ్ఞప్తి చేశారు.
15.గవర్నర్ హోలీ శుభాకాంక్షలు
హోలీ పండుగ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
16.జై మద్యంతో రాష్ట్రవ్యాప్తంగా మరణాలు : టిడిపి
జగన్ బ్రాండ్ల మద్యంతో రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది చనిపోయారు అని, ఈ మరణాలపై విచారణ జరిపించాలని టీడీపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.
17.బడిలో భగవద్గీత
గుజరాత్ సీఎం భూపేందర్ పటేల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ఆ రాష్ట్రంలోని పాఠశాలల్లో భగవద్గీత ను ఒక సబ్జెక్టుగా పెట్టాలని నిర్ణయించుకున్నారు.
18.బిజెపి ఎంపీలపై ఘాటు విమర్శలు
టిఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బాల్క సుమన్ బిజెపి ఎంపీల పై విమర్శలు చేశారు.మోడీ అమిత్ షా ను చూస్తే ఇక్కడ బిజెపి నేతలకు లాగులు తడుస్తాయని , బీజేపీ ఎంపీలు దద్దమ్మలా, అంటూ బాల్క సుమన్ ప్రశ్నించారు.
19.కెటిఆర్ పై రాజాసింగ్ విమర్శలు
కేటీఆర్ బలుపు దించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,450
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 51,770
.