పీరియడ్స్ లో నొప్పులా? ఈ చిట్కాలు పాటించండి

పీరియడ్స్ లో మహిళలు పడే బాధలు చెప్పడానికి కష్టం.బ్లీడింగ్ ఇబ్బందులు ఒక ఎత్తైతే, పీరియడ్స్ లో వచ్చే క్రాంప్స్ మరోక ఎత్తు.

 These Are The Ways To Deal With Menstrual Pain-TeluguStop.com

విపిరీతమైన నొప్పితో అమ్మాయిల మూడ్ స్వింగ్ కి కారణమవుతాయి పీరియడ్స్.మరీ ఈ పిరియడ్ నొప్పులతో ఎలా పోరాడాలి? కొన్ని చిట్కాలున్నాయి చూడాండి.

* పిరియడ్స్ లో నొప్పులు వస్తే, తీసుకునే ఆహారంలో ఉప్పు శాతం తగ్గించాలి.ఉప్పు ఎక్కువ తీసుకుంటే అది లోవర్ అబ్డామినల్ రీజియన్ లో వాపుకి కారణమవుతుంది.

దీనివల్ల నొప్పి ఇంకా పెరుగుతుందే తప్ప, తగ్గదు.

* పీరియడ్స్ నొప్పిగా ఉంటే, కాఫీ తాగడం తగ్గించాలి, లేదా పీరియడ్స్ వరకు కాఫీ మానెయ్యాలి.

కాఫీ శరీరంలో ఓస్ట్రొజన్ పెరుగుదలకి కారణమవుతుంది.దాంతో నిప్పి ఇంకా పెరిగే ప్రమాదం ఉంది.

* డార్క్ చాకోలేట్ లో యంటిఆక్సిడెంట్స్ మంచి మోతాదులో దొరుకుతాయి.అలాగే దాంట్లో మెగ్నేషియం ఉంటుంది.

పీరియడ్ నొప్పుల నుంచి డార్క్ చాకోలేట్ ఉపశమనాన్ని అందిస్తుంది.

* గోరువెచ్చని నీటిని ఏదైనా బ్యాగ్ లో పోసి పొట్ట కింది భాగంలో పెట్టుకోవాలి.

దీనివలన పీరియడ్‌లో వచ్చే మంటను తగ్గించవచ్చు.

* పిరియడ్స్ లో నీళ్ళు బాగా తాగాలి.

ఏమాత్రం డిహైడ్రేటెడ్ గా ఉన్నా, నొప్పులు ఇంకా పెరిగిపోతాయి.

* ఒక రీసర్చ్ లో తేలిన విషయం ఏమింటంటే, లావెండర్ ఆయిల్ సువాసనతో కూడా పిరియడ్ నొప్పులను తగ్గించుకోచ్చు అంట.

* యూటెరైన్ కండరాలకు మంచి రిలాక్సేషన్ దొరకాలంటే, భావప్రాప్తి మంచి మార్గం.భావప్రాప్తి కలిగితే ఈ కండరాలకు రక్తసరఫర కూడా బాగా జరుగుతుంది.

దాంతో నొప్పులు తగ్గించుకోవచ్చు.ఇక భావప్రాప్తి కలగడానికి ఏం చేయాలో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదనుకుంటా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube