జుట్టు హెవీగా రాలిపోతుందా.. అయితే ఈ సింపుల్ టిప్స్‌తో చెక్ పెట్టండి..!!

నేటి కాలంలో యువ‌తి, యువ‌కులు ఎదుర్కొంటున్న ప్ర‌ధాన స‌మ‌స్య జుట్టు రాల‌డం.ఎంత కేరింగ్ తీసుకున్నా.

 How To Stop Heavy Hair Fall In Natural Way,heavy Hair Fall,telugu Health Tips,na-TeluguStop.com

ఈ స‌మ‌స్య మాత్రం అస్స‌లు వ‌దిలిపెట్ట‌దు.జుట్టు రాల‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి.

వాతావ‌ర‌ణ కాలుష్యం, శారీరక ఒత్తిడి, ప్రోటీన్ లోపం, గర్భధారణ తర్వాత, హార్మోన్ లోపం, థైరాయిడ్‌ ఇలా ర‌క‌ర‌కాలు కార‌ణాల వ‌ల్ల జుట్టు రాలిపోతుంటుంది.ఇవేమి తెలియ‌ని కొంద‌రు మార్కెట్‌లో దొరికే ప్రతి ఉత్పత్తిని ప్రయత్నించి భంగపడతారు.

వాస్త‌వానికి వీటిలో ఏ ఉత్పత్తి సహజమైనది, సురక్షితమైనది కాదు.

అందుకే న్యాచుర‌ల్‌గానే ఈ స‌మ‌స్య‌ను త‌గ్గించుకోవాల‌రి నిపుణులు అంటున్నారు.

మ‌రి అదెలాగో ఇక్క‌డ తెలుసుకోండి.హెవీ హెయిర్ ఫాల్ త‌గ్గించ‌డంలో క‌ల‌బంద గ్రేట్‌గా ప‌నిచేస్తుంది.

కాబ‌ట్టి, క‌ల‌బంద పేస్ట్ తీసుకుని.త‌ల‌కు మ‌రియు జుట్టుకు బాగా ప‌ట్టించుకోవాలి.

అర గంట త‌ర్వాత గోరువెచ్చిని నీటితో త‌ల‌స్నానం చేయాలి.ఇలా వారానికి రెండు సార్లు చేస్తే రిజ‌ల్ట్ మీకే క‌నిపిస్తుంది.

ఉల్లిరసాన్ని తీసుకుని త‌ల‌కు మ‌రియు జుట్టుకు బాగా ప‌ట్టించుకోవాలి.పావు గంట త‌ర్వాత గోరువెచ్చిని నీటితో త‌ల‌స్నానం చేయాలి.ఇలా చేయ‌డం వ‌ల్ల కూడా హెయిర్ ఫాల్ స‌మ‌స్య‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు.అంతేకాదు, ఉల్లిరసంలోని యాంటిబాక్టీరియల్‌ గుణాలు తలలోని బాక్టీరియా, ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది.

చుండ్రును కూడా నివారిస్తుంది.

అలాగే ఎగ్ వైట్ తీసుకుని.

అందులో కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయాలి.అనంత‌రం త‌ల‌కు మ‌రియు జుట్టుకు బాగా ప‌ట్టించుకోవాలి.

పావు గంట త‌ర్వాత గోరువెచ్చిని నీటితో త‌ల‌స్నానం చేయాలి.ఇలా వారానికి ఒక‌సారి చేస్తే.

ఎగ్ లో ఉండే ప్రొటీన్స్ జుట్టు రాలడాన్ని నివారిస్తాయి.మ‌రియు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube