విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Rama Rao) పేరు చెప్పగానే చాలామందికి ఒళ్ళు పులకరిస్తుంది.ఆయన పేరులోనే ఏదో ఒక తెలియని మ్యాజిక్ ఉంది.
ఇటు రాజకీయాల్లో అటు సినిమాల్లో సంచలనం సృష్టించిన ఏకైక వ్యక్తిగా సీనియర్ ఎన్టీఆర్ (Sr.NTR) పేరు తెచ్చుకున్నారు.అలాంటి ఈయన ఎన్నో జానపద,పౌరాణిక సినిమాల్లో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే నందమూరి తారక రామారావు అని చెప్పుకునేంతలా ఫేమస్ అయ్యారు.అయితే అలాంటి సీనియర్ ఎన్టీఆర్ ఓ స్టార్ డైరెక్టర్ తో దాదాపు 14 సంవత్సరాలు మాట్లాడలేదట.
మరి ఇంతకీ అన్ని సంవత్సరాలు గ్యాప్ రావడానికి ఆ డైరెక్టర్ కి ఎన్టీఆర్ కి మధ్య జరిగిన గొడవ ఏంటి.మళ్లీ వీరిద్దరి మధ్య మాటలు ఎలా కలిశాయి అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.
సీనియర్ ఎన్టీఆర్ 14 ఏళ్లు మాట్లాడని ఆ డైరెక్టర్ ఎవరో కాదు కళాతపస్వి కే విశ్వనాథ్ (K.Vishwanath) గారు.విశ్వనాధ్ గారు చదువుకునే రోజుల్లోనే ఎన్టీఆర్ కంటే సీనియర్.వీరిద్దరూ చదువుకునేటప్పుడే చాలా సన్నిహితంగా మెదిలేవారట.అలా ఇద్దరు స్టడీస్ కంప్లీట్ చేసుకుని సినీ రంగాన్నే ఎంచుకున్నారు.ఇక స్టార్ డైరెక్టర్ గా విశ్వనాధ్ గారు పేరు తెచ్చుకుంటే స్టార్ హీరోగా ఎన్టీఆర్ గారు ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారు.
అయితే అలాంటి వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో సినిమాలు వచ్చాయి.
అయితే ఓసారి చిన్ననాటి స్నేహితులు (Chinnanati Snehithulu) అనే సినిమా తెరకెక్కించే సమయంలో ఒక ఎమోషన్ సన్నివేశాన్ని డైరెక్టర్ తెరకెక్కిస్తున్నారట.కానీ అదే సమయంలో షూటింగ్ స్పాట్ కి ఎన్టీఆర్ సన్ గ్లాసెస్ పెట్టుకొని రావడంతో విశ్వనాథ్ గారు ఇది ఎమోషన్ సీన్ మీరు సన్ గ్లాసెస్( Sunglasses ) పెట్టుకోకూడదు అని చెప్పారట.కానీ విశ్వనాథ్ గారు ఎంత చెప్పినా కూడా ఎన్టీఆర్ వినిపించుకోకుండా సన్ గ్లాసెస్ పెట్టుకునే ఉండేసరికి ఇద్దరి మధ్య మాట మాటా పెరిగి సినిమా షూటింగ్ అయిపోయాక మాట్లాడుకోవడం మానేసారట.
ఆ తర్వాత కొద్ది రోజులకు మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా వస్తే సీనియర్ ఎన్టీఆర్ మాత్రం ఆయనను తప్పించి వేరే డైరెక్టర్ ని పెట్టుకున్నారట.ఇలా వీరి మధ్య 14 ఏళ్లు అలాగే దూరం ఉంది.కానీ బాలకృష్ణ (Balakrishna) తో విశ్వనాధ్ గారు జననీ జన్మభూమి అనే సినిమా చేసే సమయంలో మళ్ళీ వీళ్ళిద్దరికీ మాటలు కలిసాయట.అలా మనస్పర్ధలు కారణంగా వీరిద్దరూ 14 సంవత్సరాలు దూరమయ్యారు.