డార్క్ సర్కిల్స్( Dark circles ).చాలా మందిని వేధించే చర్మ సమస్యల్లో ఒకటి.
ముఖ్యంగా మహిళల్లో డార్క్ సర్కిల్స్ సమస్య అత్యధికంగా కనిపిస్తుంటుంది.ఒత్తిడి, కంటి నిండా నిద్ర లేకపోవడం, ఆహారపు అలవాట్లు, డిప్రెషన్, పలు రకాల మందుల వాడకం తదితర కారణాల వల్ల కళ్ళ చుట్టూ డార్క్ సర్కిల్స్ ఏర్పడుతుంటాయి.
ఇవి ముఖంలోని కాంతిని తగ్గిస్తాయి.ఈ క్రమంలోనే డార్క్ సర్కిల్స్ ను వదిలించుకునేందుకు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.

మార్కెట్లో లభ్యమయ్యే క్రీమ్, సీరం లను కొనుగోలు చేసి వాడుతుంటారు.అయితే వాటి వల్ల ఎంత ప్రయోజనం ఉంటుందో పక్కన పెడితే.ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాను పాటిస్తే పది రోజుల్లోనే డార్క్ సర్కిల్స్ మాయం అవుతాయి.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ చిట్కా ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక చిన్న కీర దోసకాయ( Cucumber ) తీసుకుని వాటర్ లో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే ఒక బంగాళదుంప( potato ) ని తీసుకుని వాటర్ తో క్లీన్ గా వాష్ చేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, కీర దోసకాయ ముక్కలు మరియు అర కప్పు ఫ్రెష్ కలబంద( Aloe vera ) జెల్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుండి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ జ్యూస్ లో హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఆపై ఈ మిశ్రమంలో కాటన్ ప్యాడ్స్ వేసి ఇరవై సెకండ్ల పాటు నానబెట్టి ఆపై వాటిని తీసుకుని కళ్ళపై పెట్టుకోవాలి.అరగంట పాటు వాటిని ఉంచుకుని ఆపై నార్మల్ వాటర్ తో కళ్ళను క్లీన్ చేసుకోవాలి.ఇలా రోజుకు రెండు సార్లు కనుక చేస్తే కేవలం పది రోజుల్లోనే డార్క్ సర్కిల్స్ మాయం అవుతాయి.
కాబట్టి ఎవరైతే డార్క్ సర్కిల్స్ సమస్యతో తీవ్రంగా సతమతం అవుతున్నారో వారు తప్పకుండా ఈ సింపుల్ రెమెడీని పాటించండి .మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.