ఈ రోజుల్లో నెలకు లక్ష రూపాయలు సంపాదించినా సమాజంలో ఎంతో గౌరవం లభిస్తుంది కానీ ఒక మహిళ రోజుకే నాలుగు కోట్లు సంపాదిస్తున్నా ఆమెను అందరూ అసహ్యించుకుంటున్నారు.ఆమె ఒకప్పుడు కారు పార్కింగ్ స్థలంలో ఓ చిన్న సంస్థ ఏర్పాటు చేశారు.
ఇప్పుడది ప్రపంచాన్ని ఏలుతోంది. డెనిస్ కోట్స్(denise Coates) అనే ఆ ఇంగ్లీష్ మహిళ 2000లో “బెట్365” (Bet365)అనే ఆన్‌లైన్ బెట్టింగ్ సంస్థ ప్రారంభించింది.
ఇది వేల కోట్ల టర్నోవర్‌తో, 8,500 మంది ఉద్యోగులతో ఈ సంస్థ పెద్దదిగా పెరిగిపోయింది.దీంతో డెనిస్ కోట్స్ బ్రిటన్‌లోని అత్యంత సంపన్న మహిళల్లో ఒకరిగా అవతరించారు.
డెనిస్ కోట్స్ విజయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.కానీ, విమర్శకులు మాత్రం ఆమె సంస్థపై నిప్పులు చెరుగుతున్నారు.ఎందుకంటే, ఇది పేద ప్రజలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునే బెట్టింగ్ వేదిక.ఇక్కడ లక్షలాది మంది తక్కువ ఆదాయం ఉన్నవారు తమ కష్టార్జితాన్ని పోగొట్టుకుంటున్నారు.2024 విషయానికి వస్తే, డెనిస్ కోట్స్(Denise Coates) వ్యక్తిగత ఆదాయం అక్షరాలా రూ.1,500 కోట్లు.గత సంవత్సరంతో పోలిస్తే ఇది తక్కువే అయినా, ఈ మొత్తం మామూలు విషయం కాదు.గత ఏడేళ్లలో ఆమె సంపద ఏకంగా రూ.20,000 కోట్లను దాటిపోయింది.
బెట్365 (Bet365)సంస్థ 2024 మార్చి నాటి ఆర్థిక సంవత్సరం రికార్డుల ప్రకారం, డెనిస్ తీసుకున్న జీతం రూ.950 కోట్లు.అంతేకాదు, కంపెనీ డివిడెండ్‌లో సగం అంటే రూ.1,100 కోట్లలో సగం కూడా ఆమెకే దక్కింది.దీన్ని బట్టి చూస్తే, ఆమె రోజువారీ ఆదాయం రూ.4 కోట్లకు పైమాటే.గత పదేళ్లలో ఆమె ఆర్జించిన మొత్తం దాదాపు రూ.24,000 కోట్లు.ఆన్‌లైన్ బెట్టింగ్స్ ఊపందుకున్న కోవిడ్-19 మహమ్మారి సమయంలో, అంటే 2020లో ఆమె ఆదాయం అత్యధికంగా రూ.4,690 కోట్లుగా నమోదైంది.
డెనిస్ కుటుంబం ఈ వ్యాపారంలో చాలా కీలకంగా ఉంది.ఆమె సోదరుడు జాన్ కోట్స్ సంస్థకు సంయుక్త సీఈఓగా(CEO), ప్రధాన వాటాదారుగా కొనసాగుతున్నారు.ఇంకో విషయం ఏంటంటే, కోట్స్ కుటుంబానికి చెందిన స్టోక్ సిటీ ఫుట్‌బాల్ క్లబ్ స్టేడియానికి బెట్365 పేరు పెట్టారంటే, ఈ వ్యాపారం ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు.
అయితే, బెట్365 కేవలం విజయాలతోనే కాదు, వివాదాలతోనూ సహవాసం చేసింది.2020లో డెనిస్ తండ్రి పీటర్ కోట్స్(Peter Coates) బ్రిటన్ ప్రధాని కెయిర్ స్టార్మర్ నేతృత్వంలోని లేబర్ పార్టీకి రూ.25 లక్షలు విరాళంగా ఇవ్వడం రాజకీయ దుమారం రేపింది.2023లో కస్టమర్ల భద్రతను నిర్ధారించడంలో, మనీలాండరింగ్‌ను నిరోధించడంలో విఫలమైనందుకు బెట్365 సంస్థకు రూ.5.82 కోట్ల జరిమానా కూడా పడింది.