మరోసారి అన్నయ్యతో మాస్ రాజా.. మరి ఎప్పటికి వర్కౌట్ అవుతుందో?

మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే మెగా ఫ్యాన్స్ ఫుల్ పూనకాలతో ఊగిపోతారు అనే విషయం తెలిసిందే.ఇక తాజాగా నటించిన మెగాస్టార్ ”వాల్తేరు వీరయ్య” సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 13న రిలీజ్ అయ్యింది.

 Raviteja Another Movie With Chiranjeevi Details , Director Bobby, Megastar Chira-TeluguStop.com

ఈ సినిమా మెగా ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఆడియెన్స్ ను సైతం మెప్పించింది.

ఇక ఈ సినిమాలో మెగాస్టార్ తో పాటు మాస్ రాజా రవితేజ కూడా కీలక పాత్రలో నటించాడు.

ఇటీవలే ధమాకా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మాస్ రాజా రవితేజ ఇక ఇప్పుడు మెగాస్టార్ తో కలిసి వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ విక్రమ్ పాత్రలో మాస్ రాజా ఫుల్ సందడి చేసారు.

Telugu Bobby, Chiranjeevi, Ravi Teja, Shruti Haasan-Movie

చిరు, రవితేజ బ్రదర్స్ గా నటించారు.చాలా ఏళ్ల తర్వాత ఈ కాంబో రిపీట్ అవ్వడం అలాగే సూపర్ హిట్ టాక్ తో దూసుకు పోవడం ఇప్పుడు మరింత ఆసక్తిగా మారింది.ఈ సినిమా సక్సెస్ నేపథ్యంలో టీమ్ అంతా సక్సెస్ మీట్ ను నిర్వహించారు.మరి ఈ సినిమా మీట్ లో రవితేజ మెగాస్టార్ తో మరో సినిమా చేయాలనీ ఉంది అంటూ చెప్పాడు.

Telugu Bobby, Chiranjeevi, Ravi Teja, Shruti Haasan-Movie

దీంతో ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఈసారి ఫుల్ లెంగ్త్ సినిమా అన్నయ్యతో చేయాలి అనుకుంటున్నాను అంటూ రవితేజ తన మనసులోని మాట చెప్పడంతో ఈ వార్త మెగా ఫ్యాన్స్ తో పాటు మాస్ రాజా ఫ్యాన్స్ మధ్య కూడా ఆసక్తిగా మారింది.ఫ్యాన్స్ కూడా వీరిద్దరూ కలిసి ఫుల్ లెంగ్త్ సినిమా చేయాలని కోరుకుంటున్నారు.మరి ఇది ఎప్పటికి సాధ్యం అవుతుందో వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube