మల్లన్న బ్రహ్మోత్సవాలకు పూర్తయిన ఏర్పాట్లు.. ఇక భక్తులకు..

మాఘ మాసంలో వచ్చే పండుగల్లో మహా శివరాత్రి కూడా ఒకటి.హిందువులు జరుపుకునే పండుగలలో ముఖ్యమైన పండుగ ఏదని అడిగితే మహాశివరాత్రి అని వెంటనే చెప్పేస్తారు.

 Arrangements Completed For Mallanna Brahmotsavam.. Now For The Devotees, Mallan-TeluguStop.com

ఈరోజు లింగోద్భవం జరిగిందని పురాణాలలో ఉంది.అంతే కాకుండా శివపార్వతుల వివాహం జరిగిన రోజు శివరాత్రి అని చెబుతూ ఉంటారు.

ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజుగా భావించి భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో శివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటారు.

ఈ సంవత్సరం మహా శివరాత్రి ఫిబ్రవరి 18వ తేదీ శనివారం జరుపుకునే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో శైవ క్షేత్రాలు శివరాత్రి వేడుకలకు ముస్తాబవుతున్నాయి.కనుక శైవ క్షేత్రం శ్రీశైలంలో మల్లన్న, భ్రమరాంబల కల్యాణానికి బ్రహ్మోత్సవా ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు.

శ్రీశైల దేవ స్థానంలో ఫిబ్రవరి 11 నుంచి 21వ తేదీ వరకు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నాయి.

Telugu Devotees, Devotional, Lord Shiva, Maha Shivratri, Srisailam-Latest News -

అయితే మహాశివరాత్రి కి సంబంధించిన ఏర్పాట్లు ఆలయ అధికారులు చేస్తున్నారు.భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లను ఈవో లవన్న చేస్తున్నారు.కృష్ణ దేవరాయగోపురం, నాగుల కట్ట, అమ్మవారి దేవాలయం, కళ్యాణ మండపం, శ్రీ స్వామివారి నిత్య కళ్యాణ మండప ప్రాణంగాన్ని పరిశీలించారు.

ప్రస్తుత క్యూలైన్లకుంటే వేరువేరుగా కొంచెం ఎత్తులో మరొక క్యూ లైన్ ఏర్పాటు చేయాలని అధికారులు అభిప్రాయపడుతున్నారు.అలా చేస్తే స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు స్వామివారి దర్శనం సులువుగా కలుగుతుందని అధికారులు వెల్లడించారు.

కళ్యాణ కట్ట దగ్గర శ్రీ స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం వెంకటాపురం నుంచి మహా పాదయాత్రగా వచ్చే భక్తుల కోసం కూడా ఆలయ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube