హనుమన్నవావతారాలు అంటే ఏమిటి.. అవి ఏమిటో తెలుసా?

మన హిందూ సాంప్రదాయం ప్రకారం.ఎంతో మంది దేవుళ్ళు ప్రసిద్ధిచెందినప్పటికు చాలా మంది భక్తులు ఆంజనేయ స్వామిని పూజిస్తారు.

 What Is The Meaning Of Hanumannavatar And What They Are, Hunumannavatar, Anjaney-TeluguStop.com

ఈ క్రమంలోనే స్వామివారికి ఎంతో ఇష్టమైన మంగళవారం, గురువారం, శనివారాలలో ప్రత్యేక పూజలు చేస్తూ ఉపవాసం ఉంటారు.ఆంజనేయస్వామి అంటేనే ధైర్యానికి, బలానికి ప్రతీక అని చెప్పవచ్చు.

ఈ క్రమంలోనే తీవ్ర భయాందోళన చెందేవారు నిత్యం హనుమాన్ చాలీసా పఠిస్తే వారికి భయభ్రాంతులు తొలగిపోతాయని భావిస్తారు.

ఎవరికైతే శని ప్రభావ దోషము ఉంటుందో అలాంటి వారు ఆంజనేయస్వామికి శనివారం ఉపవాసం ఉండి పూజ చేయటం వల్ల శని గ్రహ దోషం తొలగిపోతుందని చెప్పవచ్చు.

పురాణాల ప్రకారం ఒక రోజు శనీశ్వరుడు తన ప్రభావంతో ఆంజనేయస్వామిని వశపరచుకోవాలని భావించాడు.ఈ క్రమంలోనే ఆంజనేయ స్వామి శనీశ్వరుడిని తలక్రిందులుగా వేలాడదీయడంతో శని తన తప్పును తెలుసుకుని తనని మన్నించమని వేడుకున్నాడు.

ఇకపై ఆంజనేయ స్వామి భక్తుల జోలికి రానని శని చెబుతాడు.ఈ క్రమంలోనే ఏ భక్తునికి అయితే శని ప్రభావం ఉంటుందో ఆ భక్తుడు ఆంజనేయస్వామికి పూజించినచో శనిగ్రహ ప్రభావం తొలగిపోతుందని పురాణాలు చెబుతున్నాయి.

Telugu Anjaneya Swamy, Anjaneyaswamy, Saturday, Hanuman Chalisa, Hanumannavatara

ఈ విధంగా భక్తులు ఎంతో విశ్వసించే ఆంజనేయ స్వామి కూడా తొమ్మిది రూపాలతో భక్తులకు దర్శనమిస్తాడు.ఈ విధంగా ఆంజనేయ స్వామి తొమ్మిది రూపాలలో దర్శనం ఇవ్వడం వల్ల ఆంజనేయ స్వామిని హనుమన్నవావతారాలంటారు.ఈ విషయం పరాశర సంహితలో పరాశర మహర్షి వివరించడం జరిగింది.మరి ఆంజనేయ స్వామి 9 రూపాలు ఏమిటో తెలుసుకుందాం.

ప్రసన్నాంజనేయస్వామి,వీరాంజనేయస్వామి,వింశతిభుజాంజనేయస్వామి,పంచముఖాంజనేయస్వామి, అష్టాదశ భుజాంజనేయస్వామి, సువర్చలాంజనేయస్వామి,చతుర్భుజాంజనేయస్వామి, ద్వాత్రింశాద్భుజాంజనేయస్వామి,వానరాకార ఆంజనేయస్వామి ఈ తొమ్మిది అవతారాలను కలిపి హనుమన్నవావతారాలంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube