విఘ్నాలు తొలగించే వినాయకుడిగా, భక్త వరాదుడిగా గ్రామీణ జిల్లా భక్తులకు విరజిల్లుతున్న ఒడ్డిమెట్ట లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలు( Sri Lakshmi Ganapathi ) సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి.వినాయక చవితి రోజు నుంచి తొమ్మిది రోజుల పాటు ఈ ఉత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహించేందుకు దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది.
చవితి రోజు దర్శించుకునేందుకు అనకపల్లి, యలమంచలి, నర్సీపట్నం, తూనీ, అన్నవరం, పాయకరావుపేట, నక్కపల్లి తదితర పట్టణాల నుంచి లక్షలాదిమంది భక్తులు తరలివస్తున్నారు.ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను కూడా నడుపుతున్నారు.
ఒడ్డిమెట్ట కైలాసగిరి( Oddimetta ) పై దాదాపు నూరేళ్ల క్రితం తాటి చెట్టు వ్రేళ్ళ దగ్గర లక్ష్మీ గణపతి వెలిశాడని స్థానిక ప్రజలు చెబుతున్నారు.నామవరం గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి స్వామి కలలో కనిపించి కై లాస గిరిపై ఈ ప్రదేశంలో తను వెలిశానని చెప్పడంతో అక్కడ తవ్వకాలు జరుపగా విగ్రహం బయటపడింది.జాతీయ రహదారికి అనుకొని మండపం వైపు విగ్రహాన్ని పెట్టీ పూజలు చేయడం మొదలుపెట్టారు.అలాగే హుండీలలో, కానుకల రూపంలో లభించిన ఆదాయంతో పాటు విరాళాలు సేకరించి కొండపై దేవాలయాన్ని నిర్మించారు.
వినాయక చవితి రోజు ఇక్కడ పెద్ద తిరునాళ్లు జరుగుతుంది.కొత్తగా వ్యాపారం ప్రారంభించే వారు, వాహనాలు కొన్నవారు ఇక్కడి విఘ్నేశ్వరుడికి పూజలు చేసిన తర్వాత తమ పనులు మొదలుపెడతారు.
ఒడ్డిమెట్ట గ్రామానికి లక్ష్మీ గణపతిని ఇలవేల్పుగా కొలుస్తారు.
చవతి రోజు బంధువుల రాకతో ఇల్లన్నీ సందడిగా ఉంటాయి.ప్రతి ఇంట్లో గణపతి పేరు ఉన్నవారు కచ్చితంగా ఉంటారు.తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి వెల్లడించారు.
ఉదయం 5 గంటల నుంచి స్వామివారి దర్శనం మొదలవుతుందని వెల్లడించారు.సోమవారం సాయంత్రం స్వామివారి కళ్యాణం నిర్వహించినట్లు తెలిపారు.చివరి రోజున అన్న సామరాధన ఉంటుందని ఈ సందర్భంగా వెల్లడించారు.అంతేకాకుండా వినాయక చవితి సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు లక్షలాదిమంది భక్తులు( Devotees ) తరలివస్తారు.
దీని వల్ల ఎలాంటి అవాంఛనీయ ఘటనలో జరగకుండా అనకపల్లి సిఐ అప్పన్న పర్యవేక్షణలో ఎస్ఐ శిరీష బందోబస్తు ఏర్పాట్లు చూసుకుంటున్నారు.
DEVOTIONAL