శబరిమల అయ్యప్ప దర్శనానికి పోటెత్తిన భక్తులు.. అక్కడి పరిస్థితి ఎలా ఉందంటే..

ప్రస్తుతం మన దేశ వ్యాప్తంగా ఎంతో మంది అయ్యప్ప స్వామి దర్శనం కోసం శబరిమలకు వెళ్తున్నారు.అంతేకాకుండా అయ్యప్ప స్వాములు ఎంతో భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామిని పూజించడానికి కేరళలోని శబరిమలకు భారీ ఎత్తున తరలి వెళ్తున్నారు.

 Devotees Flocked To Visit Sabarimala Ayyappa  What Is The Situation There , Saba-TeluguStop.com

అయ్యప్ప స్వామి దర్శనానికి భక్తులు ఇసుకేస్తే రాలనంతగా ఒక్కరోజే లక్ష మంది అయ్యప్ప స్వామి భక్తులు స్వామి దర్శనం కోసం శబరిమల చేరుకోవడం శబరిమల దేవస్థానం అధికారులు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇంకా చెప్పాలంటే టికెట్లు తీసుకొని కూడా స్వామి దర్శనం కాని వారు ఇంకా చాలా మంది ఉన్నారు అంటే పరిస్థితి ఎలాగా ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు.ప్రస్తుత అక్కడి సమాచారం ప్రకారం ఆన్లైన్లో టికెట్లు పొందిన1.10 లక్షల మంది భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు.ఇక పంబా నుంచి శబరిమల కొండపైకి వెళ్లేందుకు దాదాపు పది గంటల సమయం పట్టే అవకాశం ఉంది.ఇక ఇప్పటివరకు భక్తుల దర్శనం ద్వారా ట్రావెల్ దేవస్థానానికి 130 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆ దేవస్థాన అధికారులు అధికారికంగా ప్రకటించారు.

Telugu Bakti, Devoteesflocked, Devotional-Latest News - Telugu

అయ్యప్ప స్వామి దర్శనానికి భక్తులు భారీ స్థాయిలో వస్తున్నడంతో అధికారులు కట్టు దిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు.భక్తులు ఎటువంటి ఇబ్బంది పడకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటూ ఉన్నారు.భక్తులకు అన్నదానం నుంచి మంచినీటి సౌకర్యం వరకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటున్నారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పటిష్టమైన భద్రతను కూడా పోలీసులు ఏర్పాటు చేశారు.

చాలా మంది అయ్యప్ప భక్తులు ఎటువంటి దుర్ఘటనలు జరగకుండా స్వామివారి దర్శనం చేసుకుని ఇంటికి చేరుకోవాలని స్వామి వారిని కోరుకుందాం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube