ఇదేం తీరు.. లేట్ నైట్ వాకింగ్ చేస్తున్నారని దంపతులకు పోలీసులు భారీ ఫైన్..

బెంగళూరులో తాజాగా ఇద్దరు పోలీసులు ఒక చెత్త పని చేసి అందరి చేత తిట్లు తింటున్నారు.వివరాలు తెలుసుకుంటే, బెంగళూరులోని మాన్యతా టెక్ పార్క్‌కు సమీపంలోని సొసైటీలో నివసిస్తున్న కార్తీక్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి శుక్రవారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో రోడ్డుమీద నడుచుకుంటూ ఇంటికి బయలుదేరారు.అయితే వారిని అడ్డగించిన ఇద్దరు పోలీసులు లైట్ నైట్ వాకింగ్ చట్ట విరుద్ధమని.ఈ తప్పు చేసినందుకు రూ.3,000 చెల్లించుకోవాలని బెదిరించారు.చివరికి వారి నుంచి ఈ పోలీసులు రూ.1,000 జరిమానా వసూలు చేశారు.

 Couple Harassed By Police In Bengaluru For Late Night Walking Details, Bangalore-TeluguStop.com

ఫ్రెండ్ బర్త్‌డే సందర్భంగా ఈ దంపతులు 12 గంటలకు బయటికి వెళ్లారు.అర్ధ గంట తర్వాత తిరిగి వస్తూ ఉంటే మార్గం మధ్యలో పోలీసులు ఎదురై వారి మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.తర్వాత రూ.3,000 ఇయ్యాలని బాగా ఒత్తిడి తెచ్చారు.ఇదే సమయంలో రూ.1000 ఉన్నా సరే ఇయ్యాలంటూ మరో పోలీసు అడిగాడు.వారి బెదిరింపులకు బాగా భయపడి పోయిన అతను వెంటనే 1000 రూపాయలు ఫోన్ పే చేసేసి అక్కడి నుంచి తన భార్యను తీసుకొని వెళ్ళిపోయాడు.

కార్తీక్ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ పోలీసుల తీరును పంచుకున్నాడు.కార్తీక్ చెప్పిన సంఘటనను గమనించిన డీసీపీ నార్త్ ఈస్ట్ అనూప్ శెట్టి ఆ పోలీసులపై చర్య తీసుకుంటానని హామీ ఇచ్చారు.ఆపై ఈ పనిని సంపిగహళ్లి పోలీస్‌ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ చేసినట్లు తెలుసుకున్నారు.

తర్వాత వారిద్దరినీ సస్పెండ్‌ చేశారు.ఇలా అమాయకులను దోచేయడానికి ఆ పోలీసులకి సిగ్గుండాలని చాలామంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube