టాలీవుడ్ స్టార్ హీరో, బిగ్ బాస్ సీజన్6 హోస్ట్ నాగార్జున ఈ షోకు పూర్తిస్థాయిలో న్యాయం చేయడం లేదని చాలామంది నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.బిగ్ బాస్ షో తాజా ఎపిసోడ్ లో నాగార్జున మాట్లాడుతూ నాకు అమ్మాయిల విషయంలో పక్షపాతం ఉందని అయితే బలహీనత మాత్రం లేదని కామెంట్లు చేశారు.
తన క్యారెక్టర్ గురించి ఈ స్టేట్మెంట్ ద్వారా నాగ్ చెప్పకనే చెప్పేయడం గమనార్హం.
కొంతమంది లేడీ కంటెస్టెంట్లకు నాగ్ ఫేవర్ గా వ్యవహరిస్తున్నారనే కామెంట్లు ఈ మధ్య కాలంలో ఎక్కువ కావడం వల్ల కూడా నాగార్జున ఇలాంటి కామెంట్లు చేసి ఉండవచ్చని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సినిమా రంగంలో మన్మధుడిగా పేరును సొంతం చేసుకున్న నాగార్జున కొంతమంది హీరోయిన్లతో క్లోజ్ గా మూవ్ అయినట్టు గతంలో వార్తలు ప్రచారంలోకి వచ్చాయనే సంగతి తెలిసిందే.
అయితే హీరోయిన్లు ఎవరూ నాగార్జున గురించి నెగిటివ్ గా ఎప్పుడూ కామెంట్లు చేయలేదు.
ఆరు పదుల వయస్సులో కూడా నాగార్జున ఎనర్జీ లెవెల్స్ ఏ మాత్రం తగ్గలేదనే సంగతి తెలిసిందే.కెరీర్ విషయంలో తప్పటడుగులు పడకుండా నాగార్జున ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
త్వరలో నాగార్జున 100వ సినిమా సెట్స్ పైకి వెళ్లనుండగా ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.

నాగార్జున సైతం 100వ సినిమా కెరీర్ లో మైల్ స్టోన్ గా మిగిలిపోవాలని భావిస్తున్నారు.కచ్చితంగా ఈ సినిమాతో సక్సెస్ సాధించి 100 కోట్ల రూపాయల షేర్ మార్క్ ను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.నాగ్ రేంజ్ అంతకంతకూ పెరగాలని తర్వాత సినిమాలతో నాగ్ కోరుకున్న భారీ సక్సెస్ దక్కాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
నాగ్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండగా వరుస సక్సెస్ లు సాధించేలా నాగ్ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు.







