తిరుమలలో వేడుకగా ప్రారంభమైన శ్రీ పద్మావతీ పరిణయం

తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాల్లో భూలోక వైకుంఠాన్ని తలపించే రీతిలో స్వర్ణకాంతులు విరజిమ్మే స్వర్ణిమ మండపం లో మంగళవారం నాడు శ్రీ పద్మావతి పరిణయోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు టీటీడీ అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది.

 The Marriage Of Sri Padmavati Started As A Celebration In Thirumala , Marriage-TeluguStop.com

అందులో భాగంగా మొదటి రోజు వైశాఖశుద్ధ నవమిరోజైన మంగళవారం నాడు తిరుమలలో శ్రీవారు గజవాహనాన్ని అధిరోహించగా ఉభయనాంచారులు పల్లకిపై పరిణయోత్సవ మండపానికి సాయంత్రం 5 గంటలకు వేంచేపు చేసారు.అప్పటికే చక్కగా అలంకరించిన నారాయణగిరి ఉద్యానవనంలో వివిధ రకాల పల, పుష్పాలతో శోభాయమానంగా తీర్చిదిద్దిన పెండ్లి మండపంలో నిత్య నూతన వధూవరులైన స్వామి వారికి, అమ్మవార్లకు ఎదుర్కోలు, పూలదండలు మార్చుకోవటం, పూలబంతులాట, నూతన వస్త్ర సమర్పణ కోలాహలంగా జరిగాయి.

ఆ తరువాత శ్రీస్వామి వారికి కొలువు (ఆస్థానం) జరిగింది.ఈ కొలువులో సర్వజగత్ప్రభువైన శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి వేదాలు, సంగీతరాగాలు, కవితలు, నృత్యాలు మొదలైనవి నివేదించారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ ముఖ్య అధికారులతో పాటు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఓం నమో వేకటేశాయ

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube