ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ( Pawan Kalyan )తొలి విజయాన్ని అందుకున్నారు.ఈ క్రమంలో కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన ఘన విజయం సాధించారు.
నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి వంగా గీతపై దాదాపు 69,169 మెజార్టీతో పవన్ కల్యాణ్ గెలుపొందారు.కాగా ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి ప్రభంజనం సృష్టించిందని చెప్పుకోవచ్చు.
మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ టీడీపీ 134 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.ఈ క్రమంలో జనసేన 20 స్థానాలు, బీజేపీ ఎనిమిది స్థానాల్లో లీడింగ్ లో ఉంది.
టీడీపీ తిరుగులేని విజయాన్ని అందుకోవడంతో పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది.