క్యాబేజీ రసంతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా.. వేగంగా బరువు..

మన దేశంలో సలాడ్స్ లో ఎక్కువగా ఉపయోగించే కూరగాయలలో క్యాబేజీ(Cabbage) కూడా ఒకటి.అంతే కాకుండా ఇందులో ఉండే మూలకాలు నోటికి రుచిని అందించడమే కాకుండా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను అందిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

 Cabbage Juice Has So Many Health Benefits Fast Weight Loss , Cabbage Juice , Ant-TeluguStop.com

క్యాబేజీ రసాన్ని చేసుకునే ప్రతి రోజు తాగడం వల్ల శరీరానికి చాలా రకాల పోషకాలు అందుతాయి.ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు(Antioxidants) అధికంగా ఉండడం వల్ల కొలెస్ట్రాల్ కూడా అదుపులో ఉంటుంది.

క్యాబేజీలో విటమిన్ కె విటమిన్ సి ఇటువంటి చాలా రకాల విటమిన్లు ఉన్నాయి.కాబట్టి దీనిని జ్యూస్ గా తయారు చేసుకుని తాగడం వల్ల శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

క్యాబేజీ రసంలో ఉండే పోషకాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా రక్తపోటు సమస్యలతో బాధపడుతున్న వారికి ఎంతో ఉపయోగపడతాయి.ఇంకా చెప్పాలంటే తీవ్ర రక్తపోటు (blood pressure)సమస్యతో బాధపడుతున్న వారు ప్రతి రోజు క్యాబేజీ రసాన్ని తాగడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.

బరువు పెరగడం ప్రస్తుతం సర్వసాధారణంగా మారిపోయింది.అధికంగా ఆయిల్ ఫుడ్స్ తినడం వల్ల సులభంగా బరువు పెరుగుతున్నారు.అయితే ఇలాంటి సమస్యతో బాధపడేవారు తప్పకుండా క్యాబేజీ రసాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉండాలి.ఇందులో ఉండే ఫైబర్ శరీర బరువును తగ్గించడానికి ఎంతో ఉపయోగపడుతుంది.ఇంకా చెప్పాలంటే రోగ నిరోధక శక్తిని పెంచడానికి కూడా క్యాబేజీ రసం ఎంతగానో ఉపయోగపడుతుంది.ప్రతిరోజు క్యాబేజీ రసాన్ని ఖాళీ కడుపుతో తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

క్యాబేజీ రసాన్ని ఇలా తయారు చేసుకోవాలి? ఒక క్యాబేజీని తీసుకుని దానిని చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేసుకోవడం మంచిది.ఆ తర్వాత గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని తీసుకొని వడగట్టాలి.

అందులోకి రుచికి సరిపడా తేనెను వేసి ప్రతిరోజు తాగితే శరీరానికి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆహార నిపుణులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube