పుదీనా వలన ఎన్ని ఉపయోగాలో

పుదీనా అనేది మెంథా జాతికి చెందిన ఒక ఆకుకూర.పుదీన ఆకుల్లో ఔషధ గుణాలు బాగా ఉంటాయి.

 Healthy Benefits Of Mint-TeluguStop.com

అందుకే పుదీనా ఫ్లేవర్ తో జ్యుస్, టీ మాత్రమే కాకుండా బ్యూటి ప్రాడక్ట్స్ కూడా తయారుచేస్తున్నారు.ఈ ఔషధనిధి పుదీనా వలన కలిగే ఉపయోగాలేంటో ఓసారి చదివి తెలుసుకోండి.

* గర్భంతో ఉన్న స్త్రీలు పుదీనా, నిమ్మ, తేనె కలుపుకోని, ఒక జ్యూస్ లా చేసుకోని రోజు తాగితే వాంతులు, వికారం రాకుండా అడ్డుకోవచ్చు.

* పుదీనాలో యాంటిఆక్సిడెంట్స్, ఫైటోన్యూట్రింట్స్ అధికంగా లభిస్తాయి.

ఇవి జీర్ణశక్తికి ఎంతో మేలు చేస్తాయి.కడుపులో మంట, ఎసిడిటి వంటి సమస్యలతో పోరాడటానికి కూడా పుదీనా పనికివస్తుంది.

* ఎప్పుడైనా గమనించారా ? నొప్పులకి రాసుకునే బామ్ లో పుదీనా ఫ్లేవర్స్ ఉంటాయి.పూర్తిగా పుదీనా మీద ఆధారపడ్డ బామ్స్ చాలావరకు మార్కెట్లో దొరుకుతాయి.

ఎందుకంటే నొప్పి కలిగిన ప్రదేశాన్ని చల్లబరిచే శక్తి పుదీనాలో ఉంటుంది.

* మొటిలకు, ఇతర చర్మ సమస్యలకు పుదీనా వాడటం చక్కటి పరిష్కార మార్గంగా చెప్పుకోవచ్చు.

ఇందులో ఉండే యాంటి ఇంఫ్లేమేటరి, యాంటి బ్యాక్టీరియా లక్షణాలు, సాలిసిలిక్ ఆసిడ్ మొటిమలతో పోరాడతాయి.

* నోటి దుర్వాసన, నోట్లో ఇంఫెక్షన్స్ కి పుదీనా చక్కటి మందు.

* పుదీనాలో విటమిన్ సి, డి, ఈ, కాల్షియం, ఫాస్ ఫరస్ ఉంటాయి.ఇవి రోగనిరోధకశక్తిని పెంచుతాయి.

* పుదీనాలో దొరికే ఫైటోకెమికల్ పొటెంట్ క్యాన్సర్ తో పోరాడే బలాన్ని కలగి ఉంటుంది.

* కండరాలకి హాయిని కలిగించటంలో పుదీనాకి పుదీనే సాటి.

ఇది పిరియడ్స్ లో వచ్చే నొప్పుల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు