జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉండగా కొన్ని భారీ ఫ్లాపులు సైతం ఉన్నాయి.పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ ఏదనే ప్రశ్నకు జానీ సినిమా( Johnny Movie ) పేరు జవాబుగా వినిపిస్తుంది.
ఈ సినిమా పవన్ కళ్యాణ్ అభిమానులకు సైతం అస్సలు నచ్చలేదు.అయితే ఈ సినిమా ఫ్లాప్ అవుతుందని పవన్ కళ్యాణ్ కు ముందే తెలుసని సమాచారం అందుతోంది.
ఈ సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కగా అల్లు అరవింద్( Allu Aravind ) మాట్లాడుతూ ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.పవన్ కళ్యాణ్ వరుస విజయాలు సాధిస్తున్న తరుణంలో ప్రయోగాత్మక సినిమాలో నటించడం ఫ్యాన్స్ కు నచ్చలేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
తండేల్ సినిమా( Thandel Movie ) ప్రమోషన్స్ లో భాగంగా అల్లు అరవింద్ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తుండటం గమనార్హం.

జానీ మూవీ షూట్ జరుగుతున్న సమయంలోనే పవన్ కళ్యాణ్ కు జానీ సినిమా విషయంలో అనుమానం కలిగిందని అయితే అప్పటికే సమయం మించిపోయిందని అల్లు అరవింద్ వెల్లడించారు.అల్లు అరవింద్ చేసిన ఈ కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.జానీ సినిమాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లుక్ ఒక విధంగా మైనస్ అయిందని చెప్పవచ్చు.

జానీ మూవీ గురించి అల్లు అరవింద్ చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.అల్లు అరవింద్ తండేల్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలని కామెంట్లు వినిపిస్తున్నాయి.గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ రాబోయే రోజుల్లో భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించే దిశగా అడుగులు వేస్తున్నారు.పవన్ అల్లు అరవింద్ కాంబోలో భవిష్యత్తులో సినిమాలు వస్తాయేమో చూడాల్సి ఉంది.