తెలుగు సినిమా ఇండస్ట్రీలో గత 50 సంవత్సరాల నుంచి తనదైన రీతిలో సేవలను అందిస్తూ ఎన్నో అవార్డులను రివార్డులను మూట గట్టుకున్న ఏకైక హీరో చిరంజీవి…( Chiranjeevi ) తన అభిమానులుగా ఉన్న చాలా మంది దర్శకులు ఆయనతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు.ఇక ఇలాంటి సందర్భంలోనే ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల( Srikanth Odela ) లాంటి దర్శకులతో ఆయన సినిమాలను చేస్తున్నాడు.
మరి ఈ సినిమాల తర్వాత సందీప్ రెడ్డి వంగ( Sandeep Reddy Vanga ) లాంటి డైరెక్టర్లతో చిరంజీవి సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.

నిజానికి సందీప్ కూడా చిరంజీవి అభిమానే కావడం విశేషం…చిరంజీవి కోసమే ఆయన సినిమాలు చూసేవాడని చిరంజీవి వల్లే తను ఇండస్ట్రీకి వచ్చానని చాలా సందర్భాల్లో తెలియజేశాడు.మరి ఏది ఏమైనా కూడా చిరంజీవి లేనిదే తను ఇక్కడ ఉండేవాడిని కాదని చెప్పిన సందీప్ చిరంజీవికి ఏ రేంజ్ లో సక్సెస్ ని అందిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక ఇతనితో పాటుగా వంశీ పైడిపల్లి( Vamsi Paidipally ) డైరెక్షన్ లో కూడా చిరంజీవి ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.

ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇక ఇప్పుడు స్టార్ డైరెక్టర్లందరు చిరంజీవితో సినిమా చేయడానికి కసరత్తులు చేస్తున్నారు.ఎందుకంటే వాళ్ళందరూ చిరంజీవి సినిమాలు చూసుకుంటూ పెరిగారు.కాబట్టి చిరంజీవితో సినిమా చేస్తే అదొక సంతృప్తిని ఇస్తుందనే ఉద్దేశ్యంతోనే వాళ్ళు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది…ఎవరైనా ఎంటైర్ కెరియర్ లో ఒక్కసారన్నా అతనితో తమ స్టామినా ఏంటో చూపించుకోవాలని చూస్తున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.చూడాలి మరి ఆయన ఏ దర్శకుడి తో సినిమా చేస్తాడు ఎవరిని రిజెక్ట్ చేస్తాడు అనేది…
.







