స్మార్ట్ టీవీ ( Smart TV )వినియోగదారుల కోసం ముందుగా WiFi ఆధారిత ఎంటర్టైన్మెంట్ సర్వీసులను అందించిన స్ట్రీమ్ బాక్స్ మీడియా ఇప్పుడు మరో కీలక అడుగు వేసింది.Dor Play పేరుతో కొత్త సూపర్ ఎంటర్టైన్మెంట్ యాప్ తీసుకువచ్చింది.
ఈ యాప్ సర్వీసులు తాజాగా ప్రారంభమయ్యాయి.కేవలం రూ.399 కే మూడు నెలల పాటు 20కి పైగా OTTలు, 300కి పైగా లైవ్ టీవీ ఛానల్స్( Live TV Channels ) అందిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం ప్రతి OTT కోసం వేర్వేరు సబ్‌స్క్రిప్షన్ తీసుకునే అవసరం లేదు.
Dor Play App ద్వారా ఒక్క సబ్‌స్క్రిప్షన్‌తోనే 20+ OTTలు, 300కి పైగా లైవ్ టీవీ ఛానల్స్ పొందవచ్చు.ఇది ముందుగా స్ట్రీమ్ బాక్స్ మీడియా టీవీ వినియోగదారులకు ఈ సర్వీసులు అందించినప్పటికీ, ఇప్పుడు స్మార్ట్‌ఫోన్లకు కూడా అందుబాటులోకి తెచ్చింది.

Dor Play App ను గూగుల్ ప్లే స్టోర్‌లో( Google Play Store ) లిస్ట్ చేసింది.వినియోగదారులు ఈ యాప్‌ను Google Play Store నుంచి డౌన్లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.ఈ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను Flipkart ద్వారా కొనుగోలు చేయవచ్చు.
డోర్ ప్లే సర్వీసులు ఉచితం కాదు.ప్రస్తుతం ఈ యాప్ రూ.399 రూపాయల ప్లాన్‌ను అందిస్తోంది.ఈ రూ.399 ప్లాన్ మూడు నెలల పాటు 20+ OTTలు, 300+ లైవ్ టీవీ ఛానల్స్ యాక్సెస్ అందిస్తుంది.ఈ సర్వీస్ ద్వారా వినియోగదారులు తక్కువ ఖర్చుతో వివిధ OTTలను ఆస్వాదించవచ్చు.
ఈ యాప్‌లో అందించే OTTలు Dor Play ద్వారా పలు ప్రముఖ OTTలు ఒకే ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంటాయి.

డిస్నీ+ హాట్ స్టార్, జీ5, సోనీ LIV, లయన్స్ గేట్ ప్లే, సన్ నెక్స్ట్, డోలీవుడ్ ప్లే, డిస్కవరీ+, ఫ్యాన్ కోడ్, షెమారు మీ, ఈటీవీ విన్, చౌపాల్, స్టేజ్, ట్రావెల్ XP, నమ్మ ఫ్లిక్స్, ఆహా, రాజ్ డిజిటల్, ప్లే ఫ్లిక్, డిస్ట్రో టీవీ, మనోరమ, VR ఓటీటీ, ఓటీటీ ప్లస్ వాటిలో ప్రధానమైనవి:అయితే, ఈ Dor Play App కేవలం మొబైల్ ఫోన్లలో మాత్రమే పనిచేస్తుంది.టీవీ లేదా ల్యాప్‌టాప్‌లో ఈ సర్వీసులు అందుబాటులో ఉండవని కంపెనీ తెలిపింది.అతి తక్కువ ధరలో ఎక్కువ ఎంటర్టైన్మెంట్ అందించడంలో ఈ Dor Play App వినూత్న ప్రయత్నం.నెటిజన్లు ఈ ఆఫర్‌పై సానుకూలంగా స్పందిస్తున్నారు.ముఖ్యంగా, వివిధ OTT సర్వీసులకు వేర్వేరు సబ్‌స్క్రిప్షన్లు తీసుకోవాల్సిన అవసరం లేకుండా సింగిల్ సబ్‌స్క్రిప్షన్‌లో అన్ని సేవలు అందించడమే ప్రధాన ఆకర్షణగా మారింది.







