టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా మంచి సక్సెస్ అందుకున్న వారిలో ప్రొడ్యూసర్ బన్నీ వాసు( Producer Bunny Vasu ) ఒకరు.ఈయన గీత ఆర్ట్స్ 2 బ్యానర్ వ్యవహారాలన్నింటిని చూసుకుంటున్న విషయం మనకు తెలిసిందే.
అల్లు అరవింద్( Allu Aravind ) సలహాలు సూచనల మేరకు ఈయన కూడా సినిమాలు నిర్మిస్తూ ఉంటారు.ఇలా నిర్మాతగా మంచి సక్సెస్ అందుకున్న బన్నివాసు గీత ఆర్ట్స్ నుంచి బయటకు వస్తారు అంటే ఇదివరకు వార్తలు వచ్చాయి కానీ తాను మాత్రం బయటకు వచ్చే ప్రసక్తే లేదని క్లారిటీ ఇచ్చారు.

ఇక త్వరలోనే బన్నీ వాసు గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై నిర్మించిన చిత్రం తండేల్( Thandel ).నాగచైతన్య( Naga Chaitanya ) సాయి పల్లవి( Sai Pallavi ) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీ విడుదల కాబోతోంది.ఇప్పటికే ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడి ఉన్నాయి.అలాగే ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చిత్ర బృందం కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇలా ఈ సినిమా విడుదలకు ఒక రోజు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రొడ్యూసర్ బన్నీ వాసు పలు విషయాలను వెల్లడించారు.ఇప్పటికే తన బ్యానర్ లో ఎంతో మంది హీరోలతో సినిమాలు చేసిన విషయం తెలిసిందే.అయితే తన బ్యానర్ లో ముగ్గురు హీరోలతో సినిమా చేయడమే తన డ్రీమ్ అంటూ తన కల బయటపెట్టారు.
తనకు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రభాస్( Prabhas ) అలాగే బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్( Ranbir Kapoor ) ఈ ముగ్గురితో సినిమా చేయాలని కళ కోరిక ఉంది.ఎప్పటికైనా ఈ ముగ్గురితో ఖచ్చితంగా సినిమా చేస్తాను అంటూ బన్నీ వాసు తెలిపారు.
ఇక ఈ హీరోలకు అనుగుణంగా కథ దొరికితే తప్పకుండా ఈయన నిర్మాణంలో కూడా సినిమాలు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పాలి మరి ఈయన కల ఎప్పుడు నెరవేరుతుంది అనేది తెలియాల్సి ఉంది.