కేరళలో( Kerala ) జరిగిన విషాదకర ఘటన ఇప్పుడు అందరినీ విషాదంలో ముంచేసింది.తనను ఎంతో ప్రేమతో పెంచి పోషించిన మావటినే ఏనుగు దారుణంగా తొక్కి చంపిన ఘటన కేరళలోని పాలక్కడ్ జిల్లాలో చోటుచేసుకుంది.
ఈ ఘటనకు సంబంధించిన భయానక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.పాలక్కడ్ లోని కుట్టనాడ్ ప్రాంతంలోని ఓ ఆలయంలో వార్షికోత్సవం సందర్భంగా ఈ ఘటన జరిగింది.
ఉత్సవాల కోసం ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.గజ సంగమం (ఏనుగుల ప్రదర్శన) కార్యక్రమంలో వల్లంకుళం నారాయన్ కుట్టి( Vallankulam Narayan Kutty ) అనే ఏనుగును ప్రదర్శన కోసం తీసుకువచ్చారు.

సుమారు రాత్రి 11 గంటల సమయంలో ఉత్సవ కార్యక్రమం ముగిసింది.మావటి కుంజుమోన్ ( Mavati Kunjumon )ఏనుగును తీసుకుని తిరిగి వస్తుండగా తన్నీర్ కోడ్ రోడ్డుపై ఏనుగు ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది.ఆగ్రహంగా మారిన ఏనుగు రోడ్డు పై ప్రజలపై దాడి చేయడం ప్రారంభించింది.పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తించిన ఏనుగు తనను నియంత్రించడానికి ప్రయత్నించిన మావటిని ఏకంగా నడి రోడ్డుపై పడేసి కాలితో తొక్కింది.
ఈ దాడి చూసిన ప్రజలు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు.అనంతరం ఏనుగు చుట్టుపక్కల ఉన్న దుకాణాలపై దాడి చేసింది.ఆలయం ప్రాంగణంలో పార్క్ చేసిన వాహనాలను కూడా ధ్వంసం చేసింది.

ఏనుగును నియంత్రించడానికి స్థానికులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.దాదాపు గంట సమయం తర్వాత ఏనుగు శాంతించింది.గాయపడిన మావటి కుంజుమోన్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఆయన అక్కడే మరణించారు.ఈ దాడిలో మరో వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఏనుగు ఉగ్రరూపం ఎందుకు దాల్చిందో ఇంకా స్పష్టత రాలేదు.ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.
ఈ సంఘటన అన్ని వర్గాల ప్రజలను తీవ్రంగా కలిచివేసింది.ముఖ్యంగా మావటుల జీవన విధానంలో వచ్చే సవాళ్ల గురించి ఇప్పుడు మరింత చర్చ జరుగుతోంది.







