ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే.మరి ఇదిలా ఉంటే బాలయ్య బాబు కొడుకు అయిన మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు అంటూ గత కొన్ని రోజుల నుంచి వార్తలైతే వినిపిస్తున్నాయి.
ఇక ప్రశాంత్ వర్మ ( Prashant Verma )డైరెక్షన్ లో ఈయన చేయబోయే సినిమా తొందర్లోనే స్టార్ట్ అవుతుంది అంటూ మరికొన్ని విషయాలు వినిపించినప్పటికి అందులో ఏమాత్రం క్లారిటీ అయితే లేకుండా పోతుంది.

ప్రస్తుతం ప్రశాంత్ వర్మ రెండు మూడు ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల మోక్షజ్ఞ సినిమా( Mokshajna movie ) ను ఎప్పుడు తెరకెక్కిస్తాడు అనే విషయంలో క్లారిటీ అయితే రావడం లేదు అంటూ నందమూరి అభిమానులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మరి ఇక్కడి వరకు బాగానే ఉంది.కానీ ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ సినిమా చేయడానికి ఆసక్తిగా ఉన్నాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇక బాలయ్య మాత్రం నాగ్ అశ్విన్( Nag Ashwin ) డైరెక్షన్ లో మోక్షజ్ఞ ఎంట్రీ ఇప్పించాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఇక ఎవరి డైరెక్షన్ లో చేసిన పర్లేదు కానీ మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తే చూడాలనే ఉద్దేశ్యంతో తెలుగు సినిమా ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్నారు.మరి బాలయ్య బాబు గత నాలుగైదు సంవత్సరాల నుంచి మోక్షజ్ఞ ఎంట్రీ ప్రతి ఇయర్ ఉంటుంది అంటు చెప్పుకుంటూ వస్తున్నప్పటికి అది మాత్రం కార్యరూపం దాల్చడం లేదు.మరి ఈ సంవత్సరం అయిన ఉంటుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…చూడాలి మరి బాలయ్య బాబు ఎవరి డైరెక్టర్ లో మోక్షజ్ఞ ఎంట్రీ ఇప్పించబోతున్నాడు అనేది తెలియాల్సి ఉంది…
.