అమెరికా కలలు కంటూ అక్రమంగా వెళ్లాలని చూసిన ఓ భారతీయుడికి(Indian) ఊహించని కష్టాలు ఎదురయ్యాయి.20 ఏళ్ల ఆకాష్ అనే యువకుడు ఏకంగా 72 లక్షలు కట్టి అమెరికా వెళ్లాలని ప్రయత్నించి చివరకు తిరిగొచ్చేశాడు.హర్యానాలోని కర్నాల్‌కు(Karnal, Haryana) చెందిన ఆకాష్ (Akash)పడిన కష్టాలు చూస్తే గుండె తరుక్కుపోతుంది.పనామా అడవుల్లో నరకం అంటే ఏంటో స్వయంగా చూసొచ్చాడతను.ఈ ప్రయాణంలో అతడు ఎదుర్కొన్న కష్టాలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆకాష్ పది నెలల క్రితం ఇండియా నుంచి బయలుదేరాడు.
మెక్సికో సరిహద్దు గోడ దూకి అమెరికాలోకి అడుగుపెట్టాలని చూశాడు.అనుకున్నదే తడవుగా జనవరి 26న గోడ దూకేశాడు కూడా.
కానీ దురదృష్టం వెంటాడింది.అమెరికా చెక్‌పోస్టు(American checkpoint) దగ్గర దొరికిపోయాడు.
వీడియోలో ఆకాష్ పనామా అడవుల్లో ఇతర అక్రమ వలసదారులతో కలిసి క్యాంప్ వేసుకుని ఉండటం చూడొచ్చు.నీళ్లు, బురద, కొండలు, గుట్టలు(Water, mud, hills, and mounds) ఇలాంటి కష్టాల మధ్య ఆడవాళ్లు, పిల్లలు కూడా నానా ఇబ్బందులు పడుతూ కనిపించారు.
అమెరికా షార్ట్‌కట్ అనుకుంటే ఎంత కష్టమో ఈ వీడియో కళ్లకు కడుతోంది.
అసలు విషయం ఏంటంటే, అమెరికాలోకి అక్రమంగా వెళ్లడానికి రెండు దారులు ఉన్నాయి.
ఒకటి మెక్సికో మీదుగా డైరెక్టుగా వెళ్లడం.రెండోది ‘డంకీ రూట్’ అనే ప్రమాదకరమైన దారి.
ఈ డంకీ రూట్‌లో చాలా దేశాలు, దట్టమైన అడవులు, సముద్రాలు దాటాల్సి ఉంటుంది.విమానాలు, టాక్సీలు, కంటైనర్ ట్రక్కులు, బస్సులు, పడవల్లో ప్రయాణం చేసి చివరకు అమెరికా చేరుకోవాలి.
ఆకాష్ డైరెక్టుగా మెక్సికో దారిలో వెళ్లేందుకే డబ్బులు కట్టాడట.కానీ ఏజెంట్లు మోసం చేసి ప్రమాదకరమైన డంకీ రూట్‌లో పంపించారని వాళ్ల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

జనవరి 26న పట్టుబడ్డ ఆకాష్ ను ఫిబ్రవరి 5న అమెరికా నుంచి ఇండియాకు వెళ్లగొట్టేశారు. ట్రంప్ సర్కార్(Trump government) అతడితో పాటు 104 మంది అక్రమ వలసదారులను కూడా అమెరికా వెనక్కి పంపించింది.ఆకాష్ చివరగా జనవరి 26న కుటుంబ సభ్యులతో మాట్లాడాడు.కొద్ది రోజుల్లో బాండ్ మీద విడుదల చేస్తారని అనుకున్నారట.కానీ అమెరికా అధికారులు బెదిరించి డిపోర్టేషన్ పేపర్లపై సంతకం పెట్టించుకున్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.సంతకం చేయకపోతే జైలుకు పంపుతామని బెదిరించారని వాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆకాష్ కోసం వాళ్ల కుటుంబం అప్పుల పాలైపోయింది.అన్నయ్య శుభమ్ చెప్పిన ప్రకారం.2.5 ఎకరాల భూమి అమ్మేశారు.అప్పులు చేశారు, నగలు తాకట్టు పెట్టారు.ఇలా మొత్తం రూ.65 లక్షలు ఏజెంట్లకు కట్టారు.తర్వాత మరో రూ.7 లక్షలు ఇచ్చారట.ఇప్పుడు వాళ్ల దగ్గర ఏమీ లేదు.“మాకు జరిగిన నష్టం ఎవరికీ జరగకూడదు.ప్రభుత్వం వెంటనే ఈ ఏజెంట్లపై చర్యలు తీసుకోవాలి” అని శుభమ్ కన్నీటి పర్యంతమయ్యాడు.







