మెగా హీరో పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) ప్రస్తుతం రాజకీయాలలో బిజీగా ఉన్న విషయం మనకు తెలిసిందే.సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి క్రేజ్ ఉన్నప్పటికీ కూడా ఈయన ప్రజాసేవ చేయటం కోసం రాజకీయాలలోకి వచ్చి రాజకీయాలలో కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని నేడు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు.
ఇక పవన్ కళ్యాణ్ పిఠాపురం ( Pithapuram ) నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా ఉన్న నేపథ్యంలో మెగా కుటుంబం నుంచి ఎంతోమంది కూడా పిఠాపురం కోసం కదలి వస్తున్నారు.పిఠాపురంలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అక్కడ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే మామయ్యకు తోడుగా కోడలు ఉపాసన ( Upasana ) సైతం పిఠాపురంలో బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టపోతున్నారని తెలుస్తోంది.స్వయంగా ఈ విషయాన్ని ఉపాసన సోషల్ మీడియా వేదికగా తెలియజేయడంతో మెగా అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.అపోలో హాస్పిటల్ ( Apollo Hospitals ) అధినేత తన తాత ప్రతాప్ రెడ్డి( Prathap Reddy ) 93వ పుట్టినరోజు సందర్భంగా పిఠాపురంలో సహాయక కార్యక్రమాలు చేయాలని నిర్ణయాన్ని ఈమె తీసుకున్నట్టు వెల్లడించారు.

పిఠాపురంలో మహిళా, శిశు సంక్షేమానికి ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.ప్రసూతి, శిశు మరణాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం, గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం అనంతరం మహిళలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించడం.మహిళా సాధికారితలో భాగంగా ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు నైపుణ్యాల పెంపు పట్ల అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నట్లు వెల్లడించారు.
వెయ్యి రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని ఉపాసన తెలియజేశారు.అదేవిధంగా ఈ కార్యక్రమం ప్రారంభం మాత్రమేనని.
త్వరలోనే 109 అంగన్‌వాడీ కేంద్ర భవనాలను పునరుద్ధరిస్తామని ఉపాసన ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియచేయడంతో మెగా ఫాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.