సినీ నటుడు నాగచైతన్య( Naga Chaitanya ) సమంత( Samantha ) ను ప్రేమించి పెళ్లి చేసుకుని ఆమెకు విడాకులు( Divorce ) ఇచ్చారు.ప్రస్తుతం ఈయన శోభిత( Sobhita ) ను రెండవ వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే.
ఇలా నాగచైతన్య స్టార్ హీరోయిన్ అయిన సమంతను పెళ్లి చేసుకుని విడాకులు ఇవ్వడంతో నిత్యం వీరికి సంబంధించి ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.అలాగే వీరి వ్యక్తిగత విషయాలను తెలుసుకోవడానికి కూడా ప్రేక్షకులు ఎంతో ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో కొంతమంది అభిమానులు వీరి పాత వీడియోలను కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉన్నారు.

ఇలా శోభితను పెళ్లి చేసుకున్న తర్వాత తన మాజీ భర్త రెండో పెళ్లి చేసుకోవడంతో తనకి ఎలాంటి అసూయ లేదు అంటూ సమంత నాగచైతన్య రెండో పెళ్లిపై అందరికీ క్లారిటీ ఇచ్చారు.అయితే 2019వ సంవత్సరంలో సమంత ఫీట్ అప్ విత్ ది స్టార్స్ అనే కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె నాగచైతన్య పెళ్లి గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాను నాగచైతన్యకు మొదటి భార్యను కాదు అంటూ ఈ కార్యక్రమంలో సమంత చేస్తున్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

మీరు విన్నది నిజమే నేను నాగచైతన్యకు మొదటి భార్యను కాదు ఆయనకు నాకంటే ముందుగా మరో భార్య కూడా ఉంది అంటూ ఈమె బాంబు పేల్చారు.మరి సమంత కంటే ముందుగా నాగచైతన్య ఎవరిని పెళ్లి చేసుకున్నారనే విషయాన్ని కొస్తే ఆయన ఎవరిని పెళ్లి చేసుకోలేదు.ఆయనకు దిండు( Pillow ) అంటే చాలా ఇష్టం అంటూ సమంత తెలిపారు.కూర్చున్నా, పడుకున్నా ఆయన ఆ దిండుని తన వద్దనే ఉంచుకుంటాడు.బెడ్ రూమ్ లో మేమిద్దరం ఒకే బెడ్ మీద పడుకున్నప్పుడు మా ఇద్దరి మధ్య ఆ దిండు ఉండాల్సిందే.అందుకే నేను నీ మొదటి భార్య అదేనంటూ చైతుని తీజ్ చేస్తుంటాను అంటూ సమంత చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.