సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా విడుదల అవుతుంది అంటే ఖచ్చితంగా ఆ సినిమాకు బెనిఫిట్ షోలు అలాగే టిక్కెట్ రేట్లు పెంచమని నిర్మాతలు ప్రభుత్వాలను కోరుతాయి.ఈ క్రమంలోనే అల్లు అరవింద్( Allu Aravind ) నిర్మాణంలో నేడు తండేల్ ( Thandel )సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే .
అయితే ఈ సినిమా కోసం నిర్మాత అల్లు అరవింద్ ఏపీ ప్రభుత్వాన్ని సంప్రదించి సినిమాకు బెనిఫిట్ షో లతో పాటు టికెట్ల రేట్లు పెంచమని కోరారు.దీంతో ఏపీ ప్రభుత్వం( AP Government ) కూడా ఈ సినిమాకు బెనిఫిట్ షో లతో పాటు టికెట్ల రేట్లను కూడా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇకపోతే తెలంగాణ( Telangana )లో ఈయన రేవంత్ రెడ్డి( Revanth Reddy )ని సంప్రదించలేదని తెలుస్తోంది.ఇదే విషయం గురించి ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఓ రిపోర్టర్ అల్లు అరవింద్ ను ప్రశ్నించారు.తెలంగాణలో సినిమా టికెట్ల ధర పెంపు అడగలేదా? అని మీడియా ప్రశ్నించగా.అల్లు అరవింద్ మాట్లాడుతూ మా సినిమాకు తెలంగాణలో టికెట్ల రేట్లు పెంచమని మేము అడగలేదు అలాంటి అవసరం కూడా మాకు లేదని తెలిపారు.
ఇక బెనిఫిట్ షోలకు కూడా అనుమతిని మేము కోరడం లేదని మాకు అలాంటి బెనిఫిట్స్ కూడా అవసరం లేదు అంటూ అల్లు అరవింద్ మాట్లాడారు.

ఇలా తెలంగాణలో టికెట్ల రేట్లు పెంచడం గురించి అల్లు అరవింద్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక రేవంత్ రెడ్డి పుష్ప 2 సినిమా విడుదల తర్వాత అల్లు అర్జున్ టార్గెట్ చేస్తూ ఆయనని అరెస్టు చేసి జైలుకు పంపించారు.ఇలా అల్లు అర్జున్ జైలుకు పంపించడమే కాకుండా ఇకపై తెలంగాణలో ఏ సినిమా విడుదల అయిన తాను ఎలాంటి సినిమాలకు అనుమతి తెలుపని టికెట్ల రేట్లు కూడా పెంచనని అసెంబ్లీలో తెలియజేశారు.
ఇక సినిమా సెలబ్రెటీలు పెద్దలందరూ కలిసి రేవంత్ రెడ్డి భేటీలో ఇదే విషయం గురించి మాట్లాడిన ఆయన తన నిర్ణయం మార్చుకోనని తెలిపారు .కానీ దిల్ రాజు సినిమాకు మాత్రం టికెట్ల రేట్లు పెంచుతూ అనుమతి ఇవ్వడంతో రేవంత్ రెడ్డి కూడా విమర్శలను ఎదుర్కొన్నారు.తాజాగా అల్లు అర్జున్ విషయంలో రేవంత్ వ్యవహరించిన తీరు అల్లు అరవింద్ కు ఏమాత్రం నచ్చలేదని అందుకే తమ సినిమా కోసం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆశ్రయించడం లేదని స్పష్టమవుతుంది.







