ఒక్కోసారి రోజంతా నిద్ర మత్తుగా ఉంటుంది.ఏ పని చేయాలేకపోతుంటారు.
ఏకాగ్రత పూర్తిగా లోపిస్తుంది.విసుగ్గా ఉంటారు.
అలసటతో కనిపిస్తుంటారు.ఎప్పుడో ఒకసారి ఇలా అనిపిస్తే పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు.
కానీ పదే పదే ఇలానే జరుగుతుంటే అస్సలు లైట్ తీసుకోవచ్చు.రోజంతా నిద్ర మత్తుగా ఉండటానికి కారణం కేవలం నిద్ర సరిపోకపోవడమే అనుకుంటారు చాలా మంది.
నిజానికి వేరే కారణాలు కూడా ఉంటాయి.
రోజంతా నిద్ర మత్తుగా, అలసటగా ఉండటానికి రక్తహీనత కారణం కావొచ్చు.
అలాగే థైరాయిడ్ సమస్యలు( Thyroid problems ) ఉన్నవారు ఈ సమస్యను ఫేస్ చేస్తుంటారు.థైరాయిడ్ హార్మోన్ అసమతుల్యత శక్తిని తగ్గించి, నిద్రమత్తుకు కారణమవుతుంది.
రోజంతా నిద్ర మత్తుగా ఉండటానికి మరో కారణం డీహైడ్రేషన్.శరీరంలో నీటి శాతం తక్కువగా ఉంటే నిద్రమత్తు, బలహీనత, తల నొప్పి కలుగుతాయి.
అధిక లేదా తక్కువ బ్లడ్ షుగర్ వల్ల అలసట, నిద్రమత్తుకు గురవుతుంటారు.

తగినన్ని గంటలు నిద్రపోకపోవడం, నిద్ర సంబంధిత వ్యాధులు, గాఢనిద్రకు పదే పదే ఆటంకాలు కలగడం వల్ల రోజంతా నిద్ర మత్తుగా ఉన్నట్లు అనిపిస్తుంది.మానసిక ఒత్తిడి, కాఫీ మరియు టీ( Stress, coffee and tea ) ఎక్కువగా తాగడం, కార్బోహైడ్రేట్లు, ప్రాసెస్డ్ ఫుడ్ ను అధికంగా తీసుకోవడం, శరీరానికి సరైన పోషకాలు అందించకపోవడం వల్ల కూడా ఈ పరిస్థితి ఎదురుకావొచ్చు.

కాబట్టి, రోజుకి కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్ర ఉండేలా చూసుకోండి.సమతుల్యమైన ఆహారం తీసుకోండి.ప్రోటీన్ రిచ్ ఫుడ్స్, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా తినండి.
కాఫీ, టీ, చక్కెర వాడకం తగ్గించండి.రోజుకు కనీసం ముప్పై నిమిషాల పాటు వ్యాయామం చేయండి.
మెదడును ఉత్తేజపరచే గ్రీన్ టీ లేదా ఏదో ఒక హెర్బల్ టీను రెగ్యులర్ గా తీసుకోవడం అలవాటు చేసుకోండి.చీకటిగా ఉంటే నిద్ర మత్తు పెరుగుతుంది.
అందువల్ల ప్రకాశవంతమైన లైటింగ్ ఉపయోగించండి.తాజా గాలి లోపలికి రావడానికి వీలుగా కిటికీలు తెరవండి.
తగినంత నీరు తీసుకోండి.మానిసక ఉల్లాసం కోసం మ్యూజిక్ వినండి.
దాంతో డై టైమ్ లో నిద్ర మత్తు వదిలిపోయి ఎంతో ఎనర్జిటిక్‌గా, యాక్టివ్ గా మారతారు.







