యుక్త వయస్సు రాగానే ముఖంపై మొటిమలు రావటం,నల్లని మచ్చలు రావటం అనేది సర్వ సాధారణమే.అయితే కొంతమందికి తగ్గిపోతాయి.
మరి కొంత మందికి వయస్సు పెరిగే కొద్దీ తగ్గకుండా అలా పెరుగుతూనే ఉంటాయి.అలాంటి వారు ఎలాంటి కాస్మొటిక్స్ వాడకుండా ఇంటిలో దొరికే సహజసిద్ధమైన పదార్ధాలతో తొలగించుకోవచ్చు.
ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.తాజా టమోటా రసాన్ని రాత్రి సమయంలో నల్లని మచ్చలు ఉన్న ప్రదేశంలో రాసి మరుసటి రోజు ఉదయం శుభ్రం చేసుకోవాలి.
మెంతి ఆకులను మెత్తని పేస్ట్ గా తయారుచేసుకొని మచ్చలు ఉన్న ప్రదేశంలో రాసి పావు గంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.రెండు స్పూన్ల పుదీనా రసంలో ఒక స్పూన్ పసుపు కలిపి ముఖానికి పట్టించి
అరగంట తర్వాత గోరువెచ్చని నీటిలో శుభ్రం చేసుకోవాలి.
రెండు స్పూన్ల నిమ్మరసంలో సరిపడా దాల్చినచెక్క పొడిని వేసి పేస్ట్ గా తయారుచేయాలి.ఈ పేస్ట్ ని ముఖానికి రాసి బాగా ఆరాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఇలా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే నాళాల్ని మచ్చలు క్రమంగా తగ్గిపోతాయి.గుడ్డు తెల్లసొనలో ఒక స్పూన్ తేనే కలిపి ముఖానికి పట్టించి ఆరాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి.
ఈ విధంగా చేయటం వలన నల్లని మచ్చలతో పాటు మృతకణాలు కూడా తొలగిపోతాయి.