ఉదయ్ కిరణ్ బ్రతికి వుండగానే మీడియా ఎలా పీక్కుతిందో తెలుసా ?

ఉదయ్ కిరణ్..

 Sad Incident In Uday Kiran Life , Uday Kiran, Uday Kiran Life ,sad Incident,ch-TeluguStop.com

ఇప్పటికీ ఎంతోమందికి ఒక ఎమోషన్ లాంటి వ్యక్తి.ఎందుకు చనిపోయాడా అని ప్రతి అభిమాని బాధపడని రోజంటూ లేదు.

ఉదయ్ కిరణ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి హ్యాట్రిక్ విజయాలతో ఇండస్ట్రీని ఒక ఊపు ఊపుతున్న సమయంలో చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత అతడిని ప్రేమించడం జరిగింది.ఆ ప్రేమ కాస్త చివరికి ఎంగేజ్మెంట్ వరకు వెళ్ళింది.

కానీ అనుకోని కారణాలతో వారి పెళ్లికి బ్రేకప్ జరగగా అదే ఉదయ్ కిరణ్ పాలిట శాపంగా మారింది.

Telugu Allari Naresh, Chiranjeevi, Kollywood, Sad, Sushmita, Tollywood, Uday Kir

చిరంజీవి అల్లుడు కాబట్టి అప్పటివరకు సినిమా అవకాశాలు ఇచ్చిన అనేకమంది తాముగానే ఆ అవకాశాలను రద్దు చేసుకున్నారు.దాంతో ఆయన కొన్నాళ్లపాటు ఇండస్ట్రీతో యుద్ధం చేసినంత పనిగా అయింది ఉదయ్ కి ఆ సమయంలో.అలా అరకొరా సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ గా ఎదగాలని ప్రయత్నించినప్పటికీ అది కుదరకపోవడంతో చివరికి కోలీవుడ్లో సైతం తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నాడు కానీ అంతలోనే ఒక బాధాకరమైన నిర్ణయం తీసుకుని తనువు చాలించాడు.

ఇదంతా మనందరికీ తెలిసిన విషయమే కానీ అసలు తెలియని విషయం ఏంటి అంటే చనిపోయిన తర్వాత, అలాగే చిరంజీవి కుమార్తెతో ఎంగేజ్మెంట్ తర్వాత మీడియా అతడిని బాగా హైలెట్ చేసింది కానీ ఉదయ్ కిరణ్ బతికున్నన్ని రోజులు మాత్రం అతని పీక్కుతుంది.దానికి సంబంధించిన ఒక విషయం చాలా రోజుల తర్వాత నటుడు అల్లరి నరేష్ బయట పెట్టాడు.

Telugu Allari Naresh, Chiranjeevi, Kollywood, Sad, Sushmita, Tollywood, Uday Kir

ఒకసారి ఉదయ్ కిరణ్ ని కలవడానికి అల్లరి నరేష్ అతడి ఇంటికి వెళ్ళాడట.వెళ్లేసరికి అతని కళ్ళు బాగా ఎర్రబడిపోయి ఏడ్చినట్టుగా కనిపిస్తున్నాయట.ఏమైంది అని అడగగా ఏమీ కాలేదని తోసిపుచ్చే ప్రయత్నం చేశాడట ఉదయ్ కిరణ్ కానీ నరేష్ గట్టిగా అడగడంతో జరిగిన విషయం చెప్పాడట.ఆ సమయం లో ఒక హీరో సినిమా కెరియర్ ఆల్మోస్ట్ ముగుస్తున్న సమయం అది.ఆయన గురించి మీడియాలో మాట్లాడుతూ ఇలాగే జరిగితే రానున్న కాలంలో ఉదయ్ కిరణ్ కి వచ్చిన పరిస్థితి ఈ హీరోకి వస్తుందంటూ ఉదాహరణగా ఉదయ్ కిరణ్ ని చూపిస్తూ వార్త ప్రచురితం చేశారట.దాంతో ఉదయ్ మనస్థాపన చెందాడట.

ఇలా తాను బతికుండగానే మీడియా అతను నిలవున వేధించింది.చనిపోయిన తర్వాత ఎంత సానుభూతి వార్తలు వేస్తే ఏం లాభం జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube