సెలబ్రెటీ క్రికెట్ లీగ్ 11వ సీజన్ శనివారం నుండి ఆరంభం కానుంది.ఫిబ్రవరి 8 నుంచి మార్చి 2 వరకు జరిగే ఈ సీజన్‌లో వివిధ భాషల సినీ తారలు తమ క్రికెట్ ప్రతిభను ప్రదర్శించనున్నారు.
ఈసారి టోర్నమెంట్‌లో మొత్తం ఆరు భాషల చిత్ర పరిశ్రమలకు చెందిన టీములు బరిలోకి దిగుతున్నాయి.తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, భోజ్‌పురి పరిశ్రమలకు చెందిన తారలు ఈ లీగ్‌లో క్రికెట్ ఆడనున్నారు.

సెలబ్రెటీ క్రికెట్ లీగ్ ( Celebrity Cricket League )(CCL) అంటే కేవలం ఆట మాత్రమే కాదు, సినిమా తారల స్నేహభావం, క్రీడా ప్రదర్శన, అభిమానుల హంగామా అన్నీ కలసి ఒక చక్కటి క్రీడా పండుగగా మారుతుంది.ప్రతి మ్యాచ్ ఎంతో ఉత్కంఠభరితంగా ఉండనుందని నిర్వాహకులు తెలిపారు.క్రికెట్ అభిమానులు ఈ టోర్నమెంట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఎలాంటి జట్లు బరిలో ఉన్నాయన్నా విషయానికి వస్తే.అక్కినేని అఖిల్తెలుగు వారియర్స్( Akkineni Akhiltelugu Warriors ), కిచ్చ సుదీప్ ( Kitcha Sudeep ) కెప్టెన్ గా కర్ణాటక బుల్డోజర్స్, ఆర్య కెప్టెన్ గా చెన్నై రైనోస్, జిషు సేన్ గుప్తా కెప్టెన్ గా బెంగాల్ టైగర్స్( Jishu Sen Gupta ), సాకిబ్ సలీం కెప్టెన్ గా ముంబై హీరోస్, సోను సూద్ కెప్టెన్ గా పంజాబ్ ది షేర్, మనోజ్ తివారీ కెప్టెన్ గా భోజ్‌పురి దబాంగ్స్ పాల్గొననున్నాయి.మొత్తం మీద ఈ 11వ సీజన్ ప్రేక్షకులకు అద్భుతమైన వినోదాన్ని అందించనుంది.
ఫిబ్రవరి 8 నుంచి మార్చి 2 వరకు జరిగే ఈ మ్యాచ్‌లను కచ్చితంగా మిస్ అవకుండా చూసేయండి.ఇక సీసీఎల్ 2025లో తెలుగు వారియర్స్ షెడ్యూల్ ఈ విధంగా ఉంది.
ఫిబ్రవరి 8న కర్ణాటక బుల్డోజర్స్ తో, ఫిబ్రవరి 14న భోజ్‌పురి దబాంగ్స్ తో, ఫిబ్రవరి 15న చెన్నై రైనోస్ తో, ఫిబ్రవరి 23న బెంగాల్ టైగర్స్ తో తలపడనుంది.








