తాజాగా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్( Allu Aravind ) నాగచైతన్య హీరోగా నటించిన తండేల్( Thandel ) ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.నిర్మాత దిల్ రాజుతో( Dil Raju ) స్టేజ్ పై అల్లు అరవింద్ సరదాగా మాట్లాడుతూ గేమ్ చేంజర్( Game Changer ) సినిమాపై సెటైర్లు వేశారు.
అందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ.
ఈ మధ్య ఒక చరిత్ర సృష్టించిన దిల్ రాజు.అంటే ఒక సినిమా ఇలా కిందకి దించి.
మరో సినిమాని ఎక్కడికో తీసుకెళ్లి.మళ్లీ ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ని ఆహ్వానించి రకరకాలు చేశాడు ఒక వారంలో అని నవ్వుతూ దిల్ రాజుతో అన్నారు అరవింద్.

అయితే అల్లు అరవింద్ చేసిన వాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మెగా అభిమానులు గట్టిగానే మండిపడ్డారు.అల్లు అరవింద్ కావాలనే గేమ్ ఛేంజర్‌పై సెటైర్ వేశారంటూ ట్రోల్స్ చేశారు అంటూ ఒక రేంజ్ లో విడుచుకుపడుతున్నారు చెర్రీ అభిమానులు.అయితే అల్లు అరవింద్ పై ఈ ట్రోల్స్ చేస్తున్న సమయంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గా మారింది.ఆ వీడియోలో అల్లు అరవింద్ రామ్ చరణ్( Ram Charan ) గురించి చాలా గొప్పగా మాట్లాడాడు.
తండేల్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అల్లు అరవింద్ ఓ బాలీవుడ్ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చారు.అందులో మగధీర సినిమా( Magadheera Movie ) గురించి ఓ ప్రశ్న అడిగారు యాంకర్.
ఆ సమయంలో రాజమౌళిని( Rajamouli ) మీరు ఎందుకు సంప్రదించారు.ఆయన ఒక మంచి తెలుగు డైరెక్టర్.

ఆడియన్స్ పల్స్ తెలిసిన వ్యక్తి అనే లాజిక్ మీదే ఆ సినిమా చేయాలని అడిగారా? అంటూ యాంకర్ ప్రశ్నించింది.ఈ విషయంపై అల్లు అరవింద్ మాట్లాడుతూ… నా అల్లుడు రామ్ చరణ్ చేసిన మొదటి సినిమా కేవలం యావరేజ్ అయింది.ఆ తర్వాతి సినిమాకి నేనే నిర్మాత.అందుకే చరణ్‌కి పెద్ద హిట్ ఇవ్వాలని అనుకున్నాను.అందుకే మంచి డైరెక్టర్ దగ్గరికి వెళ్లాను.చాలా ఖర్చు పెట్టాను.
అదే మగధీర తీయడానికి ప్రధాన కారణం.అనుకున్నది చేశాను.
నా అల్లుడికి పెద్ద హిట్ ఇచ్చాను.అదీ తనపై నా ప్రేమ అని అరవింద్ చెప్పుకొచ్చారు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అల్లు అభిమానులు ఈ వీడియోని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.దీంతో మరోసారి సోషల్ మీడియాలో అల్లు ఫాన్స్ వర్సెస్ మెగా ఫ్యాన్స్ అంటూ వార్ నడుస్తోంది.