వైరల్ వీడియో: నీళ్లు తాగేందుకు వచ్చిన ఏనుగుపై మొసలి దాడి.. చివరకు?

అడవిలో రకరకాల జంతువులు ఉంటాయి.దాహం వేస్తే ఆ జంతువులు సరస్సుల దగ్గరకు వెళ్లి నీళ్లు తాగుతుంటాయి.

 Viral Video Crocodile Attack On An Elephant That Came To Drink Water Finally,.od-TeluguStop.com

అయితే సరస్సుల్లో నివసించే మొసళ్లు( Crocodiles ) ప్రమాదకరమైనవి.అవి నీళ్లు తాగడానికి వచ్చిన జంతువులపై దాడి చేస్తుంటాయి.

నీటిలో ఉండే మొసళ్లకు పదేనుగుల బలం ఉందని మనం చిన్నప్పటి నుండి వైన్ ఉంటాము.కానీ, ఇటీవలి ఘటనలో ఆ బలం ఏనుగుపై పనిచేయలేదు.

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ ఘటనలో, నీళ్లు తాగడానికి సరస్సు వద్దకు వెళ్లిన ఏనుగుపై మొసలి దాడి చేసింది.అయితే ఏనుగు తన ఆత్మరక్షణ కోసం మొసలిపై ఎదురుదాడి చేసి, తన ప్రాణాన్ని కాపాడుకుంది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెటిజన్లను ఆకర్షిస్తోంది.

మొసళ్లు నీటిలో బలంగా ఉంటాయి.వాటిని ఎదుర్కోవడం సింహాలు, పులులు, ఏనుగుల( Lions, tigers, elephants ) వంటి శక్తివంతమైన జంతువులకైనా కష్టమే.కానీ మొసళ్లు నీటి బయటకు వస్తే మాత్రం అవి తక్కువ ప్రభావం చూపుతాయి.

అందువల్ల పెద్ద జంతువులు వాటి జోలికి పోయేందుకు భయపడతాయి.అయితే కొన్ని సందర్భాల్లో అనుకోకుండా మొసలికి చిక్కిపోయిన జంతువులు తమ ప్రతిభతో బయటపడుతుంటాయి.

ఈ వీడియోలో కూడా అలాంటి సంఘటనే జరిగింది.ఒక ఏనుగుల గుంపు అడవిలోని సరస్సు దగ్గరకు నీళ్లు తాగేందుకు వెళ్లింది.

నీటిలోకి దిగగానే అక్కడున్న మొసళ్లు ఒక్కసారిగా దాడి చేశాయి.ఒక మొసలి, ఏనుగు తొండం పట్టుకుని దాన్ని నీళ్లలోకి లాగేందుకు ప్రయత్నించింది.

అయితే ఆ ఏనుగు దిగువ కాలు ఉపయోగించి మొసలిపై గట్టిగా తొక్కింది.చివరికి మొసలి పట్టును విడిచిపెట్టి నీళ్లలోకి వెనక్కి వెళ్లిపోయింది.

ఈ ఘటన వీడియోను చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.ఏనుగు మొసలికి భలేగా బుద్ధి చెప్పిందంటూ కొందరు కామెంట్ చేస్తుంటే.మరికొందరు స్థానం బలం ప్రతిసారి ఉపయోగపడదని కామెంట్ చేస్తున్నారు.ఈ వీడియో వైరల్ అవ్వడంతో, ప్రకృతిలో జరిగే రసవత్తర సంఘటనలు మరోసారి అందరినీ ఆశ్చర్యపరచాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube