మీ సిమ్ యాక్టివ్ గా ఉంచాలంటే మినిమం రీచార్జ్ వ్యాలిడిటీ ప్లాన్స్ ఇవే..

గత కొద్దీ రోజుల్లో మొబైల్ నెట్‌వర్క్‌ టారిఫ్‌ ప్లాన్‌లు( Mobile Tariff Plans ) భారీగా పెరుగుతున్నాయి.ఒకప్పుడు కేవలం 10 రూపాయల రీఛార్జ్ చేస్తే ఒక నెలపాటు ఫోన్ వాడే పరిస్థితి ఉండేది.

 These Are The Minimum Recharge Validity Plans Of Jio Airtel Vi Bsnl Details, Mob-TeluguStop.com

కానీ, ప్రస్తుతం టెక్నాలజీ అభివృద్ధితో పాటు డేటా వినియోగం పెరిగిపోవడంతో ప్లాన్ల ధరలు కూడా క్రమంగా పెరిగాయి.మొదట్లో 500 రూపాయల రీఛార్జ్‌ ద్వారా మూడు నెలలపాటు అన్‌లిమిటెడ్ టాక్‌టైమ్‌ ప్లాన్లు అందుబాటులో ఉండేవి.

కానీ ఇప్పుడు అదే రకమైన ప్లాన్ కోసం 700 రూపాయల నుంచి 800 రూపాయల వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.మరి ఈ నేపథ్యంలో జియో,( Jio ) ఎయిర్‌టెల్,( Airtel ) వోడాఫోన్ ఐడియా,( VI ) బీఎస్ఎన్ఎల్‌( BSNL ) వంటి ప్రధాన నెట్‌వర్క్‌ కంపెనీలు అందిస్తున్న మినిమం వ్యాలిడిటీ రీఛార్జ్‌ ప్లాన్లు ఇలా ఉన్నాయి.

Telugu Recharge, Airtel, Bsnl Recharge, India, Jiominimum, Tariff, Telecom, Voda

2025లో జియో మినిమం వ్యాలిడిటీ రీఛార్జ్ ప్లాన్స్( Minimum Validity Recharge Plan ) చుస్తే.రూ.189 ప్లాన్ లో వ్యాలిడిటీ 28 రోజులు, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMS, మొత్తానికి 2GB డేటా ఇస్తుంది.

అదే ఎయిర్‌టెల్ మినిమం వ్యాలిడిటీ రీఛార్జ్ ప్లాన్ విషయానికి వస్తే.రూ.199 ప్లాన్ లో వ్యాలిడిటీ 28 రోజులు, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMS , అలాగే 2GB డేటా వస్తుంది.

ఇక వోడాఫోన్ ఐడియా (VI) మినిమం వ్యాలిడిటీ రీఛార్జ్ ప్లాన్ విషయానికి వస్తే.రూ.99 ప్లాన్ లో వ్యాలిడిటీ 15 రోజులు, 200MB డేటా, రూ.99 లిమిటెడ్ టాక్‌టైమ్ లభిస్తాయి.

Telugu Recharge, Airtel, Bsnl Recharge, India, Jiominimum, Tariff, Telecom, Voda

అలాగే BSNL మినిమం వ్యాలిడిటీ రీఛార్జ్ ప్లాన్‌ల విష్యాకి వస్తే.రూ.59 ప్లాన్ లో వ్యాలిడిటీ 7 రోజులు కాగా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ లభిస్తుంది.అలాగే రూ.99 ప్లాన్ లో వ్యాలిడిటీ 17 రోజులు, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ లభిస్తాయి.

ఈ ప్లాన్ల ధరల పెంపు కారణంగా వినియోగదారులపై ఆర్థిక భారాలు పెరుగుతున్నాయి.

తక్కువ ధరల్లో సౌకర్యాలు తగ్గిపోతున్నాయి.ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ వినియోగదారులకు ఇది తీవ్ర సమస్యగా మారుతోంది.

కంపెనీలు సాంకేతిక సేవల విస్తరణను అందిస్తున్నప్పటికీ, ధరల పెంపు సామాన్య కస్టమర్లకు ఇబ్బంది కలిగిస్తోంది.మొత్తానికి నెట్‌వర్క్ కంపెనీలు మరింత సమర్థవంతమైన, వినియోగదారులకు మేలు చేసే విధానాలు తీసుకురావాలని కస్టమర్లు కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube