వైరల్ వీడియో: కుంభమేళాలో ఆ పనిచేసిందుకు జంటపై రెచ్చిపోయిన నాగ సాధు

ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా( Maha Kumbh Mela ) భక్తులతో కిక్కిరిసిపోయింది.144 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ మహా కుంభమేళాలో పాల్గొనడానికి దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా, విదేశాల నుంచి కూడా భక్తులు భారీగా హాజరవుతున్నారు.ముఖ్యంగా త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసేందుకు భక్తులు విశేషంగా ఆసక్తి చూపిస్తున్నారు.ఈ పుణ్య మహోత్సవం కోసం యూపీలోని యోగి సర్కారు ప్రత్యేక చర్యలు చేపట్టింది.భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాత్కాలిక గుడారాలు, శిబిరాలు ఏర్పాటు చేసింది.అలాగే, కుంభమేళా ప్రాంతంలో మద్యం, మాంసాహారం పూర్తిగా నిషేధం విధించింది.

 Naga Sadhu Attacks On Family Who Cooking Chicken In Kumbh Mela Video Viral Detai-TeluguStop.com

అయితే, ఈ నేపథ్యంలో కుంభమేళా ప్రాంతంలో ఒక జంట( Couple ) చేసిన వివాదాస్పద చర్య హిందూ భక్తులను ఆగ్రహానికి గురిచేసింది.సదరు జంట తమ గుడారంలో మాంసాహారం( Meat ) వండుకుంటుండగా, అక్కడి భక్తులు అది గమనించి నాగాసాధులకు( Naga Sadhus ) సమాచారం అందించారు.ఇక విషయమా తెలుసుకున్న నాగాసాధులు, భక్తులు ఆ జంట ఉన్న గుడారానికి చేరుకుని ఆవేశంతో వారిపై తీవ్రంగా మండిపడ్డారు.గిన్నెల్లో ఉన్న మాంసాహారం వంటకాలను కింద పడేసి, పవిత్రమైన ప్రదేశంలో ఇలాంటి పనులు చేయడం పెద్ద తప్పని హెచ్చరించారు.

అంతేకాకుండా, ఆ జంట ఉంటున్న గుడారాన్ని పూర్తిగా ధ్వంసం చేసి, వారిని అక్కడి నుంచి బయటకు వెళ్లగొట్టారు.ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.కుంభమేళా వంటి పవిత్రమైన పండుగలకు హాజరయ్యే భక్తులు, అక్కడి నియమ నిబంధనలు పాటించడం ఎంతో ముఖ్యమని అధికారులు సూచిస్తున్నారు.అసభ్య చర్యలు, నిషేధిత వస్తువులను వినియోగించడం తీవ్ర అనుచితమని, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు.

ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని అధికార వర్గాలు తెలిపాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube