ఈ మధ్య కాలంలో రక్త హీనత బాధితులు రోజు రోజుకు పెరిగి పోతున్నారు.హీమోగ్లోబిన్ శాతం తగ్గిపోవడం వల్ల రక్త హీనత సమస్య ఏర్పడుతుంది.
ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే.ప్రాణాలకే ముప్పుగా మారుతుంది.
అందుకే రక్త హీనతను ఎంత త్వరగా తగ్గించుకుంటే ఆరోగ్యానికి అంత మంచిది.అయితే రక్త హీనతను నివారించడంలో కొన్ని కొన్ని ఆహారాలు గ్రేట్‌గా సహాయపడతాయి.
అలాంటి వాటిలో ఈత పండ్లు కూడా ఉన్నాయి.పల్లెటూర్లలో విరి విరిగా లభించే ఈత పండ్ల రుచి అద్భుతంగా ఉంటుంది.
అందుకే పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ఈత పండ్లను ఇష్టంగా తింటుంటారు.అయితే రుచిలోనే కాదు ఈత పండ్లలో ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, ఎంజైమ్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
అందుకే ఈత పండ్లు ఆరోగ్యానికి కూడా ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి.ముఖ్యంగా రక్త హీనత సమస్యతో బాధ పడే వారు డైట్లో ఈత పండ్లు తీసుకుంటే మంచిది.
ఎందుకంటే, ఈత పండ్లలో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది.ఈ ఐరన్ హీమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్త హీనతను దూరం చేస్తుంది.
అలాగే ఈత పండ్లు తినడం వల్ల మరిన్ని బెనిఫిట్స్ కూడా పొందొచ్చు.ఈత పండ్లు తీసుకుంటే మెదడు చురుగ్గా, వేగంగా పని చేస్తుంది.
మతిమరువు సమస్య కూడా తగ్గు ముఖం పడుతుంది.
అలాగే నీరసం, అలసట వంటి సమస్యలతో తరచూ ఇబ్బంది పడే వారు ఈత పండ్లను డైట్లో చేర్చుకుంటే.వాటిలో ఉండే గ్లూకోజ్, సుక్రోజ్, ఫ్రక్టోజ్ లు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.దాంతో నీరసం, అలసట వంటి సమస్యలు పరార్ అవుతాయి.
ఇక ఈత పండ్లను తీసుకుంటే.రోగ నిరోధక శక్తి బలపడుతుంది.
దాంతో వైరస్లు, బ్యాక్టీరియాలు దరి చేరకుండా ఉంటాయి.