సినిమా పరిశ్రమలో ఎంతో మంది నటీనటులు ఎంతో అంకితభావంతో పనిచేసే వారు.ప్రస్తుతంతో పోల్చితే గతంలో సినిమాల పట్ల నటీనటులకు అపారమైన గౌరవం ఉండేది.
చెప్పిన సమయానికి.చెప్పిన చోటికి వచ్చి సినిమాల్లో నటించేవారు.
టైమింగ్ అంటే టైమింగ్.కచ్చితంగా పాటించేవారు.
ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా అనుకున్న సమయానికి అనుకున్న సీన్ కంప్లీట్ చేసేవారు.అప్పట్లో నటులకు ఎంత అంతకిత భావం ఉండేదంటే.
బాలింత అయినా సరే సినిమా షూటింగ్ కోసం సెట్ కు వచ్చింది ఓ నటిమణి.చెప్పిన సీన్ చేసింది.
ఇంతకీ ఆ నటీమణి ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
తెలుగు సినిమా పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు షావుకారు జానకి.
తన తొలి సినిమా షావుకారునే తన ఇంటిపేరుగా మార్చుకున్న నటీమణి.తెలుగు పరిశ్రమలో ఇప్పటికీ తన గురించి గర్వంగా చెప్పుకుంటారు సినీ జనాలు.అయితే ఆమె తన తొలి సినిమాలో నటించే సమయానికి ఓ బిడ్డకు జన్మనిచ్చింది.18 ఏండ్లకే ఆమె తల్లి అయ్యింది.కుటుంబ భారాన్ని తనే మోయాల్సి వచ్చింది.డబ్బు సంపాదన కోసం సినిమాలను ఎంచుకుంది.అంతగా గ్లామర్ లేని జానకి.షావుకారు సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అయ్యింది.
ఆ సినిమా విజయం సాధించడంతో మంచి గుర్తింపు దక్కించుకుంది.ఆ తర్వాత ఈ సినిమా పేరునే తన ఇంటిపేరుగా పెట్టుకుంది.

షావుకారు సినిమా తర్వాత జెమిని నిర్మాణ సంస్థకు చెందిన ముగ్గురు కొడుకులు జానకి నటించిన రెండో సినిమా.అప్పటికి ఒకే సినిమా చేయడం మూలంగా ఆర్థిక పరిస్థితి అంతగా బాగాలేదు.అప్పుడే తనకు రెండో సంతానం కలిగింది.అప్పటికీ తను సంపూర్ణ ఆరోగ్యంగా లేదు.అదే సమయంలో జెమిని గణేషన్ సహకారంతో ముగ్గురు కొడుకులు సినిమాలో అవకాశం దక్కించుకుంది.ఈ సినిమాలో ఓ కోడలి పాత్రను జానకి చేసింది.
ఈ సినిమా షూటింగ్ కోసం సరైన తిండి లేకుండానే పిల్లల పోషణ చూసుకుంటూ రోజూ వచ్చేది.ఒక రోజు షూటింగ్ స్పాట్ లో స్పృహ తప్పి పడిపోయింది.
డాక్టర్ ను పిలిచి ట్రీట్మెంట్ చేశారు.తన పరిస్థితి నిర్మాతకు చెప్పడంతో రెమ్యునరేషన్ అంతా ఒకేసారి ఇప్పించాడు.
ఈ సినిమాలో మహానటి కన్నాంబ కోడలిగా చేసి మెప్పించింది జానకి.ఆ తర్వాత తను వెనుదిరిగి చూసుకోలేదు.