ప్రేమ అనేది చాలా విచిత్రం అయినది.దానికి వయసుతో సంబంధం ఉండదు.
కులం, మతం అంటూ అడ్డుగోడలు ఉండవు.రంగు, రూపు అనే తేడాలు ముందుకు రావు.
అందుకే చాలా మంది సినిమా సెలబ్రిటీలలు వయసుతో పనిలేకుండా ప్రేమకథలు నడిపించారు.మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.ఇంతకీ లేటు ఏజ్ లో ఘాటు ప్రేమ పెళ్లిల్లు ఎవరు చేసుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
రాహుల్ దేవ్ – ముగ్దా గాడ్ సే
రాహుల్ దేవ్ పేరు వినగానే కరుడుగట్టిన విలన్ పాత్రలు గుర్తుకు వస్తాయి.టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ చిత్రాల్లోనూ విలన్ క్యారెక్టర్లు చేశాడు.చివరకు తన కంటే వయసులో చాలా చిన్నఅమ్మాయిన ఈయన పెళ్లి చేసుకున్నాడు.బాలీవుడ్ బ్యూటీ మగ్దా గాడ్ సేతో రాహుల్ చాలా కాలం లివింగ్ రిలేషన్ షిప్ కకొనసాగించాడు.తాజాగా వీరు పెళ్లికి రెడీ అయ్యారు.
రాహుల్ వయసు 52 సంవత్సరాలు కాగా.ముగ్దా వయసు 34 ఏండ్లు.
ఇద్దరి మధ్య 18 ఏండ్లు తేడా ఉంది.పెళ్లికి ముందే సహజీవనం చేయడం మూలంగా ఒకరినొకరు అర్థం చేసుకున్నారు.అటు రాహుల్ కు ఇది రెండో పెళ్లి తన మొదటి భార్య ప్రస్తుతం జీవించి లేదు.
సంజయ్ దత్ – మాన్యత
బాలీవుడ్ మున్నాభాయ్ సంజయ్ దత్ కూడా లేటు వయసులో ప్రేమ వివాహం చేసుకున్నాడు.అంతేకాదు తన కంటే వయసులో చాలా చిన్నదైన మాన్యతను లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు.మాన్యత, సంజయ్ కి మూడో భార్య.
గతంలోనే రిచా శర్మ, రియా పిళ్లై అనే ఇద్దరిని వివాహం చేసుకున్నాడు.తొలి భార్య చనిపోయింది.
రెండో భార్యకు వివాదాల కారణంగా విడాకులు ఇచ్చాడు.ఆ తర్వాత మాన్యతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు సంజయ్ దత్.వీరికి ప్రస్తుతం ముగ్గురు పిల్లలు.
మిలింద్ సోమన్
బాలీవుడ్ నటుడు మిళింద్ సోమన్ సైతం తన కంటే చాలా చిన్న వయసు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.తన వయసులో సగం వయసున్న అమ్మాయితో ప్రేమలో పడ్డాడు.ఆమెను వివాహం కూడా చేసుకున్నాడు.
మిళింద్ వయసు 56 ఏండ్లు కాగా… ఆయన భార్య వయసు కేవలం 28 ఏండ్లు మాత్రమే.వీరే కాదు.
ఇంకా చాలా మంది లేటు వయసులో ఘాటు ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నవారు ఉన్నారు.