ప్రస్తుతం మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పోల్చితే సోషల్ మీడియా హవా ఓ రేంజిలో ఉంది.అన్ని అంశాలపై తమ తమ అభిప్రాయాలును సెలబ్రిటీల నుంచి సాధారణ జనాల వరకు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.
పలువురు సినీ జనాలు సైతం తమ ఫ్యాన్స్ తో సోషల్ మీడియా వేదికగా టచ్ లో ఉంటున్నారు.అయితే కొందరు ఆకతాయిలు సామాజిక మాధ్యమాల్లో సెలబ్రిటీలను ఓ రేంజిలో ట్రోలింగ్ చేస్తున్నారు.
ఈ విమర్శలు హద్దులు దాటి ఉంటున్నాయి.తెలుగు సినిమా పరిశ్రమలో తీవ్ర ట్రోలింగ్ గురైన టాప్ సెలబ్రిటీలు ఎవరో ఇప్పుడు చూద్దాం.
పవన్ కళ్యాణ్ :

తెలుగు సినిమా టాప్ హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీద వచ్చినన్ని ట్రోలింగ్స్ మరే హీరో మీద రాలేదని చెప్పుకోవచ్చు.పొలిటికల్ గా ఆయన మీద నిత్యం ట్రోలింగ్స్ నడుస్తున్నాయి.సినిమాల పరంగా ఆయనను టార్గెట్ చేయకపోయినా.రాజకీయంగా మాత్రం పలువురు టార్గెట్ చేస్తున్నారు.అయితే ఈ ట్రోలింగ్స్ కు పవన్ అభిమానులు సైతం అంతే స్థాయిలో కౌంటర్ ఇవ్వడం విశేషం.
అల్లు అర్జున్ :

మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన మరో హీరో అల్లు అర్జున్ కూడా సోషల్ మీడియాలో ఎక్కువ ట్రోలింగ్ కు గురైన వాడే.మెగా అభిమానులు కూడా బన్నీని ట్రోల్ చేయడం విశేషం.అయితే వారు మెగా అభిమానులు కాదని.
ఆపేరుతో దాడి చేసే ఆకతాయిలంటారూ మెగాస్టార్ అభిమానులు.అల్లు అర్జున్ అభిమానులు సైతం తమ హీరో మీద వచ్చే ట్రోలింగ్స్ కు గట్టి కౌంటర్స్ ఇస్తుంటారు.
మహేష్ బాబు :

నిజానికి మహేష్ బాబు ఏనాడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడలేదు.అంతేకాదు.వివాదాస్పద అంశాల వైపు కూడా వెళ్లలేదు.అయినా తనను కొందరు టార్గెట్ చేశారు.ఆయనపై నిత్యం ట్రోలింగ్స్ నడుపుతుంటారు.