సాధారణంగా స్త్రీలతో పోలిస్తే పురుషులు ఆరోగ్యం ( Men health )విషయంలో అజాగ్రత్తగా ఉంటారు.శరీరానికి అవసరం అయ్యే పోషకాలను అందించడంలో విఫలం అవుతారు.
ఈ క్రమంలోనే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.అందుకే ఆరోగ్యానికి తోడ్పడే పోషకాహారాన్ని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే పురుషుల ఆరోగ్యానికి అండగా నిలిచే ఉత్తమ ఆహారాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ, వడ, దోశ, పూరీ వంటి ఆహారాలు కాకుండా ఓట్స్ ను చేర్చుకోండి.
ఓట్స్‌లో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.ఇది చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి, జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
అలాగే పురుషులు నిత్యం ఒక గ్లాసు పాలు, ఒక కప్పు పెరుగు( Milk curd ) తీసుకోవాలి.ఈ డైరీ ప్రొడక్ట్స్ లో విటమిన్ డి, కాల్షియం, ప్రోటీన్‌తో సహా ఎన్నో పోషకాలు ఉంటాయి.
వీటిని తీసుకోవడం వల్ల ఎముకలు బలోపేతం అవుతాయి.కండరాల నిర్మాణం కూడా బాగుంటుంది.

పురుషుల ఆరోగ్యానికి అండగా నిలిచే ఆహారాల్లో చేపలు ఒకటి. గుండె జబ్బులు, క్యాన్సర్, టైప్ 2 డయాబెటిస్ మరియు అల్జీమర్స్ వంటి జబ్బులు వచ్చే రిస్క్ ను చేపలు తగ్గిస్తాయి.అలాగే పురుషులు రోజుకు ఒక ఉడికించిన గుడ్డును తీసుకోవాలి.గుడ్డు మంచి కొలెస్ట్రాల్ ను ప్రోత్సహిస్తుంది.గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.విటమిన్ డి, ప్రోటీన్ తో సహా మన శరీరానికి అవసరమయ్యే అనేక పోషకాలను చేకూరుస్తుంది.
నట్స్ అండ్ సీడ్స్ ను పురుషులు తమ డైలీ డైట్ లో చేర్చుకోవాలి.టీన్‌తో సహా ఎన్నో పోషకాలు ఉంటాయి.
వీటిని తీసుకోవడం వల్ల ఎముకలు బలోపేతం అవుతాయి.కండరాల నిర్మాణం కూడా బాగుంటుంది.

బాదం, పిస్తా, వాల్ నట్స్, పుచ్చ గింజలు, గుమ్మడి గింజలు, అవిసె గింజలు పురుషుల ఆరోగ్యానికి తోడ్పడతాయి.వీటిల్లో ఉండే జింక్ టెస్టోస్టెరాన్ ఉత్పత్తి మరియు స్పెర్మ్ కౌంట్ ను పెంచుతుంది.లైంగిక సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తుంది.టమోటాలను కూడా తరచూ పురుషులు తీసుకుంటూ ఉండాలి.టమోటాలు క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తాయి.మరియు చర్మ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి.
ఇక అరటిపండు, బెర్రీ పండ్లు, అవకాడో వంటి వాటిని పురుషులు ఆహారంలో భాగం చేసుకోవాలి.ఇవి శరీరానికి అవసరమయ్యే అనేక పోషకాలను అందించడమే కాకుండా ఎన్నో దీర్ఘకాలిక జబ్బులకు అడ్డుకట్టగా నిలుస్తాయి.