నాలుగేళ్ల క్రితం న్యూజెర్సీ( New Jersey ) నుంచి అదృశ్యమైన భారత్‌కు చెందిన 29 ఏళ్ల మహిళా విద్యార్ధి గురించి అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్ధ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) రివార్డ్‌ను ప్రకటించింది.ఆమె గురించి ఎలాంటి సమాచారం అందించినా 10 వేల డాలర్ల రివార్డ్‌ను అందజేస్తామని వెల్లడించింది.
మయూషి భగత్.( Mayushi Bhagat ) జెర్సీ సిటీలోని తన అపార్ట్‌మెంట్ నుంచి ఏప్రిల్ 29, 2019 సాయంత్రం కనిపించకుండాపోయారు.
ఆ సమయంలో కలర్‌ఫుల్ పైజామా ప్యాంట్, నల్లటి టీ షర్ట్ ధరించి ఆమె బయటకు వెళ్లింది.మే 1, 2019న మయూషి అదృశ్యమైనట్లుగా కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నాలుగేళ్లు కావొస్తున్నా ఈ కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో ఎఫ్‌బీఐ( FBI ) నెవార్క్ ఫీల్డ్ ఆఫీస్, జెర్సీ సిటీ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లు మయూషి కేసును పరిష్కరించడానికి ప్రజల సహాయాన్ని కోరుతున్నాయి.దీనిలో భాగంగా ఆమె ఆచూకీ తెలిపిన వారికి 10 వేల డాలర్ల రివార్డ్‌ను అందిస్తామని ప్రకటించాయి.
గతేడాది జూలైలో భగత్‌ను ‘తప్పిపోయిన వ్యక్తుల జాబితా’లో చేర్చింది ఎఫ్‌బీఐ.తాజాగా రివార్డ్ ప్రకటించి మరింత దూకుడు ప్రదర్శిస్తోంది.

1994 జూలైలో భారత్‌లో జన్మించిన మయూషి భగత్ స్టూడెంట్ వీసాపై అమెరికాకు వచ్చి న్యూయార్క్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో( New York Institute of Technology ) చదువుకుంటున్నారు.ఎఫ్‌బీఐ తెలిపిన వివరాల ప్రకారం.మయూషి ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ మాట్లాడుతుందని న్యూజెర్సీలోని సౌత్ ప్లెయిన్‌ఫీల్డ్‌లో ఆమెకు స్నేహితులు వున్నారని చెప్పింది.భగత్ గురించి ఆచూకీ గాని , సమాచారం గాని వుంటే ఎఫ్‌బీఐ నెవార్క్ లేదా జెర్సీ సిటీ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు కాల్ చేయాలని ఎఫ్‌బీఐ ప్రకటించింది.
అలాంటి వారికి 10 వేల డాలర్ల రివార్డ్ అందజేస్తామని తెలిపింది.

నల్లటి జుట్టు , గోధుమ రంగు కళ్లతో భగత్ సుమారు 5 అడుగుల 10 అంగుళాల ఎత్తు వున్నట్లు ఎఫ్‌బీఐ చెప్పింది.2016లో ఎఫ్ 1 స్టూడెంట్ వీసాపై( F1 Student Visa ) భగత్ అమెరికాకు వచ్చారు.దర్యాప్తు సంస్థ తన వెబ్‌సైట్‌లోని మోస్ట్ వాంటెడ్ పేజీలో భగత్‌ను మిస్సింగ్ పర్సన్ జాబితాలో చేర్చింది.







