మన హిందూ క్యాలెండర్ ప్రకారం ఆశ్వయుజ మాసం శుద్ధ పాడ్యమినుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు.ఈ తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి వివిధ తొమ్మిది అలంకరణలు తొమ్మిది రకాల వస్త్రాలు తొమ్మిది రకాల నైవేద్యాలతో పూజలు చేస్తారు.
ఈ క్రమంలోనే నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతుంటాయి.దేశవ్యాప్తంగా ప్రతి అమ్మవారి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు.
ఈ క్రమంలోనే ఈ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కొన్ని ఆలయాలను దర్శనం చేసుకోవడం వల్ల ఎంతో మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు.మరి ఆ ఆలయాలు ఏవి అనే విషయానికి వస్తే.
అమ్మవారి శక్తి పీఠాలలో ఒకటైన కామాక్షి శక్తిపీఠం ఆలయాన్ని తప్పకుండా దర్శనం చేసుకోవాలి.ఈ ఆలయం గౌహతి నీలాంచల్ పర్వతంపై ఉంది.
నైనిటాల్‌లోని నాయిని సరస్సు ఉత్తర ఒడ్డున ఉన్నటువంటి నైనాదేవి ఆలయాన్ని సందర్శించడం ఎంతో శుభకరం.హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో కాళీధర్ కొండల మధ్య ఉన్నటువంటి జ్వాల దేవి ఆలయాన్ని దర్శించాలి.
రాజస్థాన్లోని కర్ణి మాత ఆలయం, కోల్‌కతాలోని మా దక్షిణేశ్వర్ కాళీ ఆలయాలను ముఖ్యంగా నవరాత్రులలో సందర్శించడం ఎంతో ఉత్తమమని చెప్పవచ్చు.
నవరాత్రులలో భాగంగా ఈ ఆలయాలను దర్శించడం వల్ల అన్ని శుభపరిణామాలు కలుగుతాయని భావిస్తారు.అయితే నవరాత్రులలో ప్రతి అమ్మవారి ఆలయంలో ఈ విధమైనటువంటి పూజలను నిర్వహిస్తారు కనుక మనం అనుకూలంగా ఉన్న ఆలయాలను కూడా సందర్శించి అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు.అయితే ఈ ఆలయాలు అష్టాదశ శక్తి పీఠాలుగా పేరుగాంచాయి.
పురాణాల ప్రకారం పార్వతీ దేవిశరీరాన్ని ఖండించినప్పుడు అమ్మవారి శరీరభాగాలు పడిన ప్రదేశంలో ఈ విధమైనటువంటి అష్టాదశ శక్తి పీఠాలు ఏర్పడ్డాయని పురాణాలు చెబుతున్నాయి.
DEVOTIONAL