ఇటీవల కాలంలో వృద్ధులను సైబర్ నేరగాళ్లు ( Cyber criminals )బాగా టార్గెట్ చేస్తున్నారు.వారిని ఈజీగా బురిడీ కొట్టించి చాలానే డబ్బులను దోచేస్తున్నారు అయితే ఎప్పుడూ స్కామర్లే వృద్ధులు మోసం చేస్తుంటారు కానీ దక్షిణ కరోలినాలో దానికి పూర్తిగా రివర్స్ సంఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే దక్షిణ కరోలినాలోని 92 ఏళ్ల బుమ్మ ( South Carolina )అనే వృద్ధురాలికి స్కామ్ కాలర్స్ తో ఆడుకోవడం అంటే ఇష్టం.కుటుంబ సభ్యులు ‘బుమ్మ’ ( Bumma )అని ఆమెను పిలుస్తారు.
ఈ ముసలి అవ్వ స్కామ్ కాల్స్ చేసే వారితో హాస్యాస్పదమైన సంభాషణలు చేస్తూ వారిని గందరగోళానికి గురి చేస్తుంది.ఈ కాల్స్ చేసే వారు బుమ్మ మాటలకు గందరగోళానికి గురై క్షమాపణలు చెప్పి ఫోన్ పెట్టేస్తారు.
బుమ్మతో పాటు ఆమె మనవరాలు చెయెన్నే టోనీ ఈ కాల్స్ ద్వారా తెగ నవ్వుకుంటారు.
ఒంటరిగా నివసించే బుమ్మ ఇప్పటికీ చాలా చురుకైనది.
మంచి తెలివి జ్ఞాపకశక్తి ఆమె సొంతం.ఒకప్పుడు, ఈ స్కామ్ కాల్స్ ( Scam calls )వల్ల చాలా బాధపడేది.
కానీ, ఒకరోజు ఆలోచించి, ఈ కాల్స్ తో వినోదం పొందాలని నిర్ణయించుకుంది.స్కామ్ కాల్స్ వచ్చినప్పుడు, బుమ్మ చాలా తెలివిగా వ్యవహరిస్తూ, కాల్స్ చేసే వారిని గందరగోళానికి గురి చేసేలా మాట్లాడుతుంది.
అనూహ్యమైన అంశాల గురించి మాట్లాడుతూ, స్కామ్ కాల్స్ చేసే వారి ప్లాన్లను భగ్నం చేస్తుంది.
మనవరాలు తన బామ్మ బుమ్మ, స్కామ్ కాల్స్ చేసే వారితో మాట్లాడే వీడియోలను షేర్ చేసింది.వాటిలో ఒక వీడియోలో, బుమ్మ లోకం అంతా ముగిసిపోతుందని, తనకు డబ్బులు లాంటివి అవసరం లేదని చెబుతుంది.స్కామ్ చేసే వాళ్లు కూడా ఈ లోక ముగింపుకు సిద్ధంగా ఉండాలని భయపెట్టింది.
బుమ్మ మాటలకు అవాక్కయిన స్కామర్ ఫోన్ పెట్టేస్తాడు.ఇంకో వీడియోలో, సీనియర్ సిటిజన్ల కోసం ఆఫర్లు ఉన్నాయని చెప్పగా, బుమ్మ తాను వృద్ధురాలు కాదని నవ్వుతూ అబద్ధం ఆడుతుంది.
మరొకసారి, బంధువు జైల్లో ఉన్నాడని, బెయిల్ డబ్బులు కావాలని మోసం చేసే ప్రయత్నం చేస్తే, బుమ్మ బాధపడుతున్నట్లు నటిస్తుంది.చాలా ఏడుస్తుంది.
ఆ ఏడుపుకు తట్టుకోలేక, స్కామర్ ఫోన్ పెట్టేస్తాడు.
ఈ వీడియోల ద్వారా బుమ్మ స్కామ్ కాల్స్‌ని ఎంతో సరదాగా ఎదుర్కొంటుందని, తెలివితేటలు చూపిస్తోందని అర్థం చేసుకోవచ్చు.బుమ్మ పిచ్చి పిచ్చిగా మాట్లాడటం వల్ల స్కామ్ కాల్స్ బారిన పడకుండా ఉండటమే కాకుండా, నవ్వుల పువ్వులు పూయిస్తోంది.తన బామ్మ హాస్య చతురతను, కష్టాన్ని సరదాగా మార్చే బుద్ధిని చూసి మనవరాలు చాలా గర్వపడుతోంది.