సాధారణంగా హోటల్స్ ( Hotels ) లో ఫుడ్ నాసిరకంగా ఉంటుందనే విమర్శ ఉంటుంది.కొన్ని హోటల్స్ మినహాయించి మిగతా హోటల్స్ అన్ని కస్టమర్లకు హాని జరిగే విధంగా కుళ్లిపోయిన, పాచిపోయిన ఆహార పదార్థాలు వంటల్లో వాడతాయి.
వాడే వంట నూనె కూడా అన్‌హెల్తీగానే ఉంటుంది.అయితే వీటివల్ల ఆరోగ్య సమస్యలు( Health problems ) వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది.
ఇక కొంతమంది వీధి వ్యాపారాలు వాడే వంట నూనె కూడా అనారోగ్యకరమైనదని చెప్పుకోవచ్చు.ఇటీవల వీరందరి కంటే అన్‌హెల్తీ పద్ధతిలో పరోటాలు చేసే ఒక వీధి వ్యాపారి వెలుగులోకి వచ్చాడు.
చండీగఢ్( Chandigarh ) రాష్ట్రానికి చెందిన ఈ వీధి వ్యాపారి ఒక వింత పద్ధతిలో పరోటాలు కాల్చుతూ కెమెరాకి చిక్కాడు.ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఈ వీడియో చూసిన చాలా మంది ఆందోళన చెందుతున్నారు.వీడియోలో, వ్యాపారి ఒక గిన్నెలో డీజిల్ పోసి, వేడి పెనం మీద పోస్తూ కనిపిస్తాడు.డీజిల్‌లో పరోటాలు ఫ్రై చేయడం చూసి చాలా మంది షాక్ అవుతున్నారు.డీజిల్ వల్ల పరోటాల రంగు నల్లగా మారిపోయినా కూడా, కొంతమంది కస్టమర్లు వాటి రుచిని ఇష్టపడుతున్నట్లు వీడియోలో చెబుతున్నారు.
కొంతమంది ఈ పరోటాల రుచిని కచ్చోరీ లాగా ఉందని కూడా అంటున్నారు.
డీజిల్ పరోటాలు( Diesel engines ) తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాలు అధికంగానే ఉంటాయి.ఎందుకంటే డీజిల్‌లోని హానికరమైన రసాయనాలు ఉంటాయి.వీటి కారణంగా అనారోగ్యాలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ వీడియో చూసిన తర్వాత, స్థానిక ఆహార భద్రతా అధికారులు ఆ వ్యాపారి దుకాణాన్ని మూసివేశారు.డీజిల్ పరోటాలు తినడం వల్ల కలిగే ప్రమాదాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఈ వీడియోకి నాలుగు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.దీన్ని తింటే క్యాన్సర్ రావడం ఖాయమని చాలామంది నెటిజన్లు కామెంట్లు పెట్టారు.
డీజిల్ పెనంలో పోస్తే అది పెట్రోల్ లాగా ఎందుకు మండటం లేదని మరి కొంతమంది ప్రశ్నించారు.బహుశా ఇది వాడేసి నిరుపయోగంగా పడేసిన డీజిల్ అయి ఉంటుందని ఇంకొందరు అన్నారు.