మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, శరీరానికి శ్రమ లేకపోవడం, అధికంగా వ్యాయామం చేయడం, ఒత్తిడి తదితర కారణాల వల్ల ఇటీవల కాలంలో గుండె సంబంధిత జబ్బుల బారిన పడుతున్న వారి సంఖ్య భారీగా పెరిగిపోయింది. గుండెపోటుతో( Heart attack ) ప్రతి ఏడాది ఎంతో మంది మరణిస్తున్నారు.
అందుకే గుండెను పదిలంగా కాపాడుకోవడం చాలా అవసరం.అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే మూడు రకాల సూపర్ డ్రింక్స్ అద్భుతంగా సహాయపడతాయి.
ఈ డ్రింక్స్ ను డైట్ లో చేర్చుకుంటే మీ గుండె పదిలంగా ఉన్నట్లే.మరి ఇంతకీ ఆ మూడు రకాల డ్రింక్స్ ఏవేవో తెలుసుకుందాం పదండి.
మందారం టీ.( Hibiscus tea ) ఇది గుండెకు చేసే మేలు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.రోజుకు ఒక కప్పు మందారం టీని తీసుకోవడం వల్ల రక్తనాళాల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ క్రమంగా కరుగుతుంది.రక్త ప్రసరణ సజావుగా సాగుతుంది.గుండె పనితీరు( Heart function ) మెరుగుపడుతుంది.

అలాగే గుండె ఆరోగ్యానికి మేలు చేసే డ్రింక్స్ లో బీట్ రూట్ జ్యూస్ ( Beet Root Juice )ఒకటి.నిత్యం ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్ ను తయారు చేసుకుని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి అవసరమయ్యే అనేక పోషకాలు లభిస్తాయి.బీట్ రూట్ జ్యూస్ గుండె జబ్బులకు అడ్డుకట్ట వేస్తుంది.
రక్తహీనతను తరిమి కొడుతుంది.జ్ఞాపక శక్తిని సైతం పెంచుతుంది.

ఇక గుండెను పదిలంగా చూసుకునే డ్రింక్స్ లో పసుపు టీ ( Turmeric tea )కూడా ముందు వరసలో ఉంటుంది.పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనంతో పాటు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మరియు యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ గా ఉంటాయి.అందువల్ల రోజుకు ఒక కప్పు పసుపు టీ తాగితే చెడు కొలెస్ట్రాల్ మొత్తం కరిగిపోతుంది.కొలెస్ట్రాల్ కరిగితే గుండెకు ముప్పు కూడా తగ్గుతుంది.పైగా పసుపు టీ రోగ నిరోధక వ్యవస్థను( Immune system ) బలపరుస్తుంది.అనేక సీజనల్ వ్యాధులు దరిదాపుల్లోకి రాకుండా అడ్డుకట్ట వేస్తుంది.







