సాధారణంగా హీరోలు అన్న తర్వాత ఎంతో మంది హీరోయిన్లతో సినిమాలు చేస్తూ ఉంటారు .ఇక ఎంతో మంది హీరోయిన్లతో కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
అయితే కొంతమంది హీరోలు మాత్రం కేవలం సినిమా ఉన్నన్ని రోజులు మాత్రమే కాదు సినిమా పూర్తయిన తర్వాత కూడా హీరోయిన్లతో స్నేహం మెయిన్టెయిన్ చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.ఇలాంటి హీరో హీరోయిన్లు ఇటీవల కాలంలో చాలా తక్కువ మంది ఉన్నారు.
ముఖ్యంగా నాని ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎంతో మంది హీరోయిన్లతో నటించాడు.
ఈ క్రమంలోనే నాని కెరీర్లో నటించిన ముగ్గురు హీరోయిన్లతో మాత్రం ఇంకా స్నేహబంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు అని చెప్పాలి.
ఆ ముగ్గురు హీరోయిన్లు ఎవరు అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

నివేద థామస్
: నాని హీరోగా నివేదాథామస్ హీరోయిన్ గా వచ్చిన మొదటి సినిమా జెంటిల్ మెన్.ఇక ఈ సినిమా ఎంత మంచి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ సినిమాలో ఇద్దరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది.
అయితే ఆఫ్ ద స్క్రీన్ లో కూడా వీరి స్నేహం కూడా బాగా వర్కౌట్ అయిందని చెప్పాలి.తర్వాత వీరిద్దరూ నిన్ను కోరి అనే సినిమాలో నటించారు.
ఇందులోనూ వీరి లవ్ స్టోరీ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది.స్నేహితులు కావడంతో ఎంతో కంఫర్టబుల్గా వీరిద్దరూ సినిమాల్లో నటిస్తూ ఉంటారు.

కీర్తిసురేష్
: నానితో కలిసి హీరోయిన్ కీర్తిసురేష్ చేసింది కేవలం ఒకే ఒక్క సినిమా.అదే నేను లోకల్.ఈ సినిమా సూపర్ హిట్ కూడా అయింది.అయితే చేసింది ఒక్క సినిమా అయినా సరే నానీతో కీర్తి సురేష్ కు బలమైన స్నేహబంధం ఏర్పడింది.ఇక అప్పుడప్పుడు వీరిద్దరూ కలుసుకోవడం కూడా చేస్తూ ఉంటారు.

నజ్రియా
: తమిళంలో స్టార్ హీరోయిన్గా ఎంతగానో గుర్తింపు సంపాదించుకుంది నజ్రియా.తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చింది.నాని హీరోగా నటించిన అంటే సుందరానికి సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయ్యింది.
అయితే చేసింది ఒక్క సినిమా అయినా నాని నజ్రియా మధ్య స్నేహ బంధం మాత్రం ఎంత క్లోజ్ అయింది అని చెప్పాలి.వీరిద్దరూ ఎక్కడ కలిసిన ఎంతో సరదాగా ముచ్చటిస్తూ ఉంటారు అని చెప్పాలి.
ఇలా నాని కెరీర్లో ఎంతో మంది హీరోయిన్లతో నటించిన ఈ ముగ్గురు తోనే స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ ఏర్పడింది అని చెప్పాలి.







